Mumbai Shocker: ఆ పని చేసుకుందామంటూ విద్యార్థినికి అశ్లీల వీడియోలు, అసభ్యకర ఛాటింగ్, ముంబైలో బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
నిందితుడు యూట్యూబ్ నుంచి వాట్సాప్ కాంటాక్ట్ డిటైల్స్ హ్యాక్ చేయడం ఎలాగో నేర్చుకున్నాడని పోలీసులు తెలిపారు.
Mumbai, July 22: మహిళా కళాశాల విద్యార్థులకు అసభ్యకరమైన మరియు అభ్యంతరకరమైన సందేశాలు పంపినందుకు 32 ఏళ్ల బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌ను (Bank staffer held) అంధేరి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు యూట్యూబ్ నుంచి వాట్సాప్ కాంటాక్ట్ డిటైల్స్ హ్యాక్ చేయడం ఎలాగో నేర్చుకున్నాడని పోలీసులు తెలిపారు. అతడిని బుధవారం కోర్టులో హాజరుపరచగా, పోలీసు కస్టడీకి తరలించారు. ఫిబ్రవరిలో పలు అశ్లీల సందేశాలు, వీడియోలు రావడంతో ఓ కళాశాల విద్యార్థి ( students in Mumbai) అంధేరి పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు తొలిసారిగా వెలుగులోకి వచ్చింది.
అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ దిగంబర్ పగర్ నేతృత్వంలోని పోలీసు బృందం దర్యాప్తు ప్రారంభించింది మరియు కాల్ డేటా రికార్డులు మరియు ఐపి చిరునామా సహాయంతో చివరకు మంగళవారం ధారవి నుండి అతన్ని పట్టుకుంది. నిందితుల నుంచి 12కి పైగా సిమ్‌కార్డులు, 7 మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐరోలిలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో పనిచేస్తున్న నిందితుడు రవి దండు విచారణలో, లాక్‌డౌన్ సమయంలో రోడ్డుపై సిమ్ కార్డ్ దొరికిందని, వాట్సాప్‌లో నంబర్‌ను ఉపయోగించగలిగానని చెప్పాడు. యూట్యూబ్‌లోని వీడియో ద్వారా వాట్సాప్ ఖాతాలను ఎలా హ్యాక్ చేయాలో కూడా నేర్చుకున్నాడు.
కాలేజీ విద్యార్ధినికి యూనివర్సిటీ ప్రొఫైసర్‌గా పరిచయం చేసుకున్నానని, ఆమె మొబైల్ నెంబర్‌కు పంపిన ఓటీపీని తనకు చెప్పడంతో ఆమె వాట్సాప్ ప్రొఫైల్, కాంటాక్ట్స్ పూర్తిగా తన యాక్సెస్‌లోకి వచ్చాయని చెప్పాడు. సరదాగా మరికొందరు మహిళలకు కూడా అశ్లీల వీడియోలు, మెసేజ్‌లు (sending obscene videos) పంపానని నిందితుడు అంగీకరించాడు. నిందితుడిని కోర్టు ఎదుట హాజరుపరచగా పోలీస్ కస్టడీకి తరలించారు