Maharashtra Shocker: స్కూల్లో బిస్కెట్లు తిన్న 150 మంది విద్యార్థులకు వాంతులు, మహారాష్ట్రలో విషాదకర ఘటన

ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారు.

Children's in School (photo-PTI)

మహారాష్ట్రలో (Maharashtra school)ని ఛత్రపతి శంభాజీనగర్‌ జిల్లాలో ఓ పాఠశాలలో పౌష్టికాహార భోజన కార్యక్రమంలో భాగంగా అందించిన బిస్కెట్లు (biscuits) తిని సుమారు 150 మందికిపైగా విద్యార్థులు (Students) ఆసుపత్రిపాలయ్యారు. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారు.కేకేట్‌ జల్గావ్‌ గ్రామంలోని పాఠశాలలో శనివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో పౌష్టికాహార భోజన కార్యక్రమంలో భాగంగా పిల్లలకు బిస్కెట్లు అందించారు.

కాలేజీలో ఎలుకల మందు స్ప్రే చేయడం వల్ల విద్యార్థులకు తీవ్ర అస్వస్థత, ముగ్గురు పరిస్థితి విషమం, పలువురు ఐసీయూలో..

అవి తిన్న కొద్దిసేపటికే పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వికారం, వాంతులతో ఇబ్బంది పడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు, గ్రామ పెద్దలు వెంటనే పిల్లల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ఫుడ్‌ పాయిజనింగ్‌కు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.