Kidnap Drama: డ‌బ్బుకోసం సొంత మేన‌ల్లుడినే కిడ్నాప్ చేయించిన మామ‌, పోలీసుల‌తో క‌లిసి వెతుకుతున్న‌ట్లు హైడ్రామా, సినిమా లెవ‌ల్ లో క‌థ అల్లిన కిడ్నాప‌ర్

సీసీటీవీ ఫుటేజ్‌, కిడ్నాపర్లు చేసిన మొబైల్‌ నంబర్ల ద్వారా సమీపంలోని ఒక హోటల్‌ వద్ద వారు ఉన్నట్లు పోలీసులు గ్రహించారు. వెంటనే అక్కడకు వెళ్లి టీ తాగుతున్న వారిని అరెస్ట్‌ చేసి బాలుడ్ని కాపాడారు.

Representational Image (File Photo)

New Delhi, DEC 20: డబ్బులు డిమాండ్‌ చేసేందుకు మేనల్లుడైన బాలుడ్ని మేనమామ కిడ్నాప్‌ చేయించాడు. (Man Kidnapped Nephew) పోలీసులతో కలిసి వెతుకుతున్నట్లు నటించాడు. చివరకు కిడ్నాపర్లు దొరికిపోవడంతో ఆ కిడ్నాప్‌ వ్యవహారం బెడిసికొట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో (New Delhi Kidnap) ఈ సంఘటన జరిగింది. శాస్త్రి నగర్‌లో నివాసం ఉంటున్న సునీల్ కుమార్ కుమారుడైన ఏడేళ్ల బాలుడ్ని బుధవారం కిడ్నాప్‌ చేసినట్లు ఫోన్‌ కాల్‌ వచ్చింది. 30 నిమిషాల్లో మూడు లక్షలతో గుడి వద్దకు రావాలని ఆయనకు చెప్పారు. కాగా, కుమారుడు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు వెంటనే రంగంలోకి దిగారు.

Visa Free Travel: మ‌లేషియా టూర్ కు వెళ్లాల‌నుకునేవారికి బంప‌ర్ ఆఫ‌ర్, భార‌తీయుల‌కు వీసా ఫ్రీ ట్రావెల్ ప్ర‌క‌ట‌న‌ 

కిడ్నాపర్లు (Kidnap), బాలుడ్ని గుర్తించేందుకు పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌, కిడ్నాపర్లు చేసిన మొబైల్‌ నంబర్ల ద్వారా సమీపంలోని ఒక హోటల్‌ వద్ద వారు ఉన్నట్లు పోలీసులు గ్రహించారు. వెంటనే అక్కడకు వెళ్లి టీ తాగుతున్న వారిని అరెస్ట్‌ చేసి బాలుడ్ని కాపాడారు.

Ghaziabad Shocker: టీ సరిగా ఇవ్వలేదని భార్యను కత్తితో మెడపై నరికి చంపిన భర్త, అనంతరం ఇంట్లో నుంచి పరార్.. 

మరోవైపు బాలుడి కిడ్నాప్‌కు మేనమామ వికాశ్‌ ప్లాన్‌ వేసినట్లు పోలీసులు తెలిపారు. బాలుడి తండ్రి సునీల్‌ ఆర్థికంగా ఎదుగుతుండటాన్ని ఓర్వలేక డబ్బులు డిమాండ్‌ చేసేందుకు కిడ్నాప్ వ్యవహారం నడిపాడని చెప్పారు. బాలుడి కోసం పోలీసులతో కలిసి వెతుకుతూ కిడ్నాపర్లను కాపాడేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. హోటల్ వద్ద ఉన్న నిందితులు 27 ఏళ్ల సునీల్‌ పాల్, 25 ఏళ్ల దీపక్‌ను అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. చాకెట్లు ఇస్తామని ఆశపెట్టి కిడ్నాప్‌ చేసిన బాలుడ్ని కాపాడినట్లు చెప్పారు. నిందితుల మొబైల్‌ ఫోన్లు, బైక్‌ స్వాధీనం చేసుకున్నామని, దీంతో మేనమామ వికాశ్‌ ప్లాన్‌ బయటపడిందని పోలీసులు వెల్లడించారు.