Maharashtra Love Story: ప్రేమించాడు, కామ వాంఛను తీర్చుకున్నాడు, పెళ్లి చేసుకోమంటే జంప్, ఆత్మహత్యాయత్నం చేసిన యువతి, ఐసీయూలోనే పెళ్లి జరిపించిన పోలీసులు, కాసేపటికే మళ్లీ పరార్
అతడి మాయమాటలకు ఆ అమ్మాయి పడిపోయింది. ఇంకేముంది ఇద్దరూ ప్రపంచాన్ని మరచిపోయారు. ఆ యువకుడికి యువతి తన సర్వస్వాన్ని అర్పించింది. ప్రేమ పేరుతో యువతిని లోబరుచుకున్న యువకుడు శారీరక సుఖాన్ని కావాల్సినంతగా అనుభవించాడు. ఇక చాలు పెళ్లి చేసుకుందాం అని యువతి చెప్పగానే పెళ్లా..అంటూ ఆ యువకుడు ముఖం చాటేశాడు.
Pune, December 6: ఓ యువకుడు ప్రేమ పేరుతో అమ్మాయికి వలవేసాడు. అతడి మాయమాటలకు ఆ అమ్మాయి పడిపోయింది. ఇంకేముంది ఇద్దరూ ప్రపంచాన్ని మరచిపోయారు. ఆ యువకుడికి యువతి తన సర్వస్వాన్ని అర్పించింది. ప్రేమ పేరుతో యువతిని లోబరుచుకున్న యువకుడు శారీరక సుఖాన్ని కావాల్సినంతగా అనుభవించాడు. ఇక చాలు పెళ్లి చేసుకుందాం అని యువతి చెప్పగానే పెళ్లా..అంటూ ఆ యువకుడు ముఖం చాటేశాడు.
దీంతో తన శీలాన్ని పోగోట్టుకున్న బాధిత యువతి బతకడం వేస్ట్ అంటూ ఆత్మహత్యాయత్నం ( she attempted suicide) చేసింది. ఈ ఘటనలో ఆమె తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో ఆస్పత్రికి తరలించగా, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతగాడ్ని పట్టుకువచ్చి ఐసీయూ(Intensive Care Unit)లోనే పెళ్లి జరిపించారు. పెళ్లి అయితే జరిపించారు కాని ఇద్దర్నీ ఒకటి చేయలేకపోయారు. తాలి కట్టిన యువకుడు కొద్దొసేపటికే అక్కడ్నించి జంప్ అయ్యాడు. సినిమా కథను తలపిస్తున్న ఈ ఘటన మహారాష్ట్రలోని పుణే(Maharashtra's Pune district)లో చోటు చేసుకుంది.
సూరజ్ నలవాడే (Suraj Nalwade) అనే యువకుడు ఓ యువతిని గత కొంతకాలం నుంచి ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. అయితే పెళ్లి చేసుకుందాం అని యువతి అడిగేసరికి అతను ముఖం చాటేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు నవంబర్ 27న పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నం చేసింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. తనది తక్కువ కులం కావడంతోనే పెళ్లికి అంగీకరించలేదని బాధితురాలు వాపోయింది.
ANI Tweet
ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. ఆ యువకుడిని యువతి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి నిన్న తీసుకువచ్చారు. ఐసీయూలోనే యువతితో బలవంతంగా యువకుడికి పెళ్లి జరిపించారు. పోలీసుల సమక్షంలోనే ప్రేమికులు దండలు మార్చుకున్నారు. అయితే పెళ్లి అయిన కొద్దిసేపటికే యువకుడు ఆస్పత్రి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.