Shocking Incident: మటన్ కూర తక్కువ వడ్డించిందని భార్యకు నిప్పు పెట్టిన భర్త, చికిత్స పొందుతూ భార్య మృతి, మహారాష్ట్రలో జరిగిన దారుణం

తీవ్రగాయాలతో వారం రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన పల్లవి చికిత్సపొందుతూ మరణించింది....

Representational image | Photo Credits: Flickr

Mumbai, December 19: చిన్నచిన్న కారణాలతో భార్యభర్తల మధ్య తలెత్తె గొడవల కారణంగా ఒక కుటుంబం పూర్తిగా ఛిన్నాభిన్నం పిల్లలు అనాధలుగా మారే పరిస్థితి వస్తుందనటానికి ఈ ఘటనే నిదర్శనం. ముంబైలో జరిగిన ఈ ఘటన (Shocking Incident)  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం, ముంబైలోని జూయినగర్ ప్రాంతంలో మారుతి, తన భార్య పల్లవి మరియు ఇద్దరు పిల్లలతో కలిసి గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. ఉపాధి కోసం వీరు మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి ముంబై నగరానికి వలసవచ్చారు.

ఒక రోజు సాయంత్రం తాగి ఇంటికి వచ్చిన భర్తకు అతడి భార్య పల్లవి భోజనం వడ్డించింది, అయితే మటన్ కూర (Mutton Curry) తక్కువ వడ్డించిందని కోపోద్రిక్తుడైన భర్త మారుతి, ఆవేశంలో తన భార్య పల్లవిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.

ఈ చర్యతో భయపడిపోయిన తన ఇద్దరు చిన్న పిల్లలు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసి సాయం కోసం అరిచారు. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి మంటలను ఆర్పివేసి పల్లవిని దగ్గర్లోని నెరుల్ డివై పాటిల్ హాస్పిటల్ (DY Patil Hospital) కు తరలించారు. తీవ్రగాయాలతో వారం రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన పల్లవి చికిత్సపొందుతూ మరణించింది. అంతకుముందు పోలీసులు ఆమె వద్ద వాంగ్మూలం తీసుకున్నప్పుడు తనపై భర్తే హత్యాయత్నం చేశాడని చెప్పడంతో కేసు నమోదు చేసుకొని అతణ్ని అరెస్ట్ చేశారు. దీంతో తల్లిదండ్రులకు దూరమై ఆ ఇద్దరు పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకమయింది. ఈ విషాద ఘటన డిసెంబర్ రెండో వారంలో జరిగింది.