Manipur Violence: మణిపూర్ హింసపై దర్యాప్తు కోసం ముగ్గురు మాజీ మహిళా హైకోర్టు జడ్జిలతో కమిటీ, కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టు
దర్యాప్తు పరంగానే కాకుండా.. పునరావాసం, ఇతరత్రా అంశాలపైనా ఈ కమిటీ దృష్టిసారిస్తుందని స్పష్టం చేసింది.
New Delhi, August 7: మణిపూర్ హింసపై దర్యాప్తు కోసం ముగ్గురు మాజీ మహిళా హైకోర్టు జడ్జిలతో కమిటీ కూడిన కమిటీని సుప్రీం కోర్టు ప్రతిపాదించింది. దర్యాప్తు పరంగానే కాకుండా.. పునరావాసం, ఇతరత్రా అంశాలపైనా ఈ కమిటీ దృష్టిసారిస్తుందని స్పష్టం చేసింది. అంతేకాదు వివిధ రాష్ట్రాల నుంచి డీజీఐ ర్యాంక్ అధికారులతో కూడిన 42 సిట్‌లు... సీబీఐయేతర కేసులు విచారణ చేపడతాయని తెలిపింది. ఒక్కో అధికారి ఆరు సిట్‌లను పర్యవేక్షిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ముగ్గురు సభ్యుల కమిటీలో జమ్ము కశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షాలినీ జోషి, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆశా మీనన్ ఉన్నట్లు తెలిపింది. సీబీఐ దర్యాప్తు బృందంలో ఐదు రాష్ట్రాల నుంచి డిప్యూటీ సూపరిడెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారులు ఐదుగురు ఉంటారని, సీబీఐ దర్యాప్తును మాజీ ఐపీఎస్ అధికారి దత్తాత్రేయ పద్సల్గికర్ (Dattatray Padsalgikar) (మహారాష్ట్ర మాజీ డీజీపీ) పర్యవేక్షిస్తారని తెలిపింది.
Here's PTI Video
సీబీఐకి ట్రాన్స్‌ఫర్ కాని కేసుల్ని 42 సిట్‌లు విచారణ చేపడతాయి. ఈ సిట్‌లను మణిపూర్ రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి డీఐజీ ర్యాంక్ అధికారులు నేతృత్వం వహిస్తారు. దర్యాప్తు సక్రమంగా సాగుతుందో లేదో.. ఒక్కో అధికారి ఆరు సిట్‌లను చూసుకుంటారు అని తెలిపింది.