Manish Sisodia Arrested: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, మనిష్ సిసోడియా మళ్లీ అరెస్ట్, ఈ సారి అరెస్ట్ చేసింది ఈడీ, నేడు కోర్టులో విచారణకు రానున్న సిసోడియా బెయల్ పిటిషన్
ఢిల్లీ మద్యం స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్టు (Manish Sisodia Arrested) చేసినట్లు ప్రకటించింది.
New Delhi, Mar 10: ఢిల్లీ మద్యం స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్టు (Manish Sisodia Arrested) చేసినట్లు ప్రకటించింది.ఇప్పటికే సిసోడియాను ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో మూడు రోజులుగా జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో రెండో సారి ప్రశ్నించిన తర్వాత మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది.సిసోడియా బెయిల్ పిటిషన్ నేడు విచారణకు రానున్న నేపథ్యంలో అరెస్ట్ చేయడం గమనార్హం.
సిసోడియా విచారణలో తమకు సహకరించడం లేదని ఈడీ ఆరోపిస్తోంది.నేడు కోర్టులో (Delhi Court) సిసోడియాను హాజరుపరచి ఈడీ కస్టడీకి ఇవ్వాలని కోరనుంది. కాగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవినీతికి పాల్పడినందుకు సిసోడియాను ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసిన తర్వాత ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మార్చి 7న సిసోడియాను ఈడీ మొదటి సారి ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
ఇదే కేసుకు సంబంధించి హవాలాకు పాల్పడ్డారంటూ ఈడీ ఆయనను మంగళవారం జైలులో ఐదు గంటల పాటు ప్రశ్నించింది. గురువారం కూడా కొద్దిసేపు ప్రశ్నించిన ఈడీ.. సిసోడియాను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. సిసోడియాను ఈడీ అరెస్ట్ చేయడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ‘లిక్కర్ కేసులో సిసోడియాను తొలుత సీబీఐ అరెస్ట్ చేసింది.
జంతర్‌మంతర్‌లో కవిత నిరసన దీక్ష షురూ.. ప్రారంభించనున్న సీతారాం ఏచూరి.. పూర్తి వివరాలు.. వీడియోతో
ఆయన ఇంటిపై చేసిన దాడిలో సీబీఐకి ఎలాంటి నగదు, ఆధారాలు కాని లభ్యం కాలేదు. శుక్రవారం సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణకు ఉన్నది. ఆయన బెయిల్‌పై విడుదల కానున్నారు. దీంతో ఈడీ ఇప్పుడు సిసోడియాను అరెస్ట్ చేసింది. రోజుకో కేసు బనాయించి ఆయనను జైలులో ఉంచడమే వారి ఏకైక లక్ష్యం. వారికి ప్రజలే తగిన సమాధానం ఇస్తారు’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.