Stock Markets: త‌ల‌కిందుల‌వుతున్న ఎగ్జిట్ పోల్స్, భారీ న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్లు, ల‌క్ష‌ల కోట్ల ఇన్వెస్ట‌ర్ల సంప‌ద ఆవిరి

ఉద‌యం నుంచి ఎన్డీయేకు (NDA) అనుకూలంగా ట్రెండ్స్ రాక‌పోవడంతో ఇన్వెస్ట‌ర్లు వెనుకంజ వేస్తున్నారు. ఉద‌య ప్రారంభంలోనే సెన్సెక్స్ 2వేల‌కు పైగా పాయింట్ల న‌ష్టంతో మొద‌లైంది.

Mumbai, June 04: ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌తో అమాంతం లాభ‌ప‌డ్డ స్టాక్ మార్కెట్లు (Stock Markets)...ఎన్నిక‌ల రిజ‌ల్ట్స్ (Election Results)రోజు మాత్రం బోల్తా ప‌డుతున్నాయి. ఉద‌యం నుంచి ఎన్డీయేకు (NDA) అనుకూలంగా ట్రెండ్స్ రాక‌పోవడంతో ఇన్వెస్ట‌ర్లు వెనుకంజ వేస్తున్నారు. ఉద‌య ప్రారంభంలోనే సెన్సెక్స్ 2వేల‌కు పైగా పాయింట్ల న‌ష్టంతో మొద‌లైంది. ఆ త‌ర్వాత ట్రెండ్స్ ఎన్డీయేకు ప్ర‌తికూలంగా రావ‌డంతో మ‌రింత దిగ‌జారుతూ వ‌చ్చాయి.

AP Elections Result 2024: ఏపీలో 15 లోక్‌స‌భ స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతున్న టీడీపీ, 5 స్థానాల్లో వైసీపీ లీడింగ్, బీజేపీ మూడు స్థానాలో ముందంజ 

సెన్సెక్స్ దాదాపు 4 శాతానికి పైగా నష్టంలో ఉంది. నిఫ్టీ కూడా అదేస్థాయిలో లాస్ ను మూట‌గ‌ట్టుకుంది. సోమ‌వారం నాడు ఏకంగా 14 ల‌క్ష‌ల కోట్లు సంపాదించిన ఇన్వెస్ట‌ర్లు...ఇవాళ అంత‌కంటే భారీ స్థాయిలో న‌ష్ట‌పోయిన‌ట్లు తెలుస్తోంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif