Maruti Suzuki Wagonr Waltz Limited Edition: మారుతి సుజుకీ నుంచి మ‌రో బ‌డ్జెట్ ఫ్రెండ్లీ కారు వ‌చ్చేసింది, వాగ‌నార్ వాల్ట్స్ లిమిటెడ్ ఎడిష‌న్ కేవ‌లం రూ. 5.65 ల‌క్ష‌ల‌కే

దీని ధర రూ.5.65 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. వ్యాగన్ఆర్ కారు ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జడ్ఎక్స్ఐ వేరియంట్లలో పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లలో లభిస్తుంది.

Maruti Suzuki Wagonr Waltz Limited Edition

Mumbai, SEP 21: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ (Maruti Suzuki WagonR Waltz) లిమిటెడ్ ఎడిషన్ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.5.65 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. వ్యాగన్ఆర్ కారు ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జడ్ఎక్స్ఐ వేరియంట్లలో పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మారుతి సుజుకి కార్లలో వ్యాగన్ఆర్ ఒకటి. 1999లో ఆవిష్కరించినప్పటి నుంచి 32.50 లక్షల యూనిట్ల వ్యాగన్ఆర్ కార్లు అమ్ముడు పోయాయి. మిడ్ సైజ్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్‌ కార్ల విక్రయాల్లో వ్యాగన్ఆర్ కార్లది 64 శాతం వాటా.

Audi Q8 Facelift: ఆడి నుంచి భారత మార్కెట్లోకి క్యూ8 ఫేస్‌లిఫ్ట్ కారు, ధర రూ.1.17 కోట్లు పై మాటే, కేవలం 5.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగం దీని సొంతం 

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎక్స్‌టీరియర్‌గా ఫాగ్ ల్యాంప్స్, వీల్ ఆర్క్ క్లాడింగ్, బంపర్ ప్రొటెక్టర్స్, సైడ్ స్కర్ట్స్, బాడీ సైడ్ మోల్డింగ్, ఫ్రంట్ క్రోమ్ గ్రిల్లె తదితర ఫీచర్లు ఉంటాయి. ఇంటీరియర్‌గా స్టైలింగ్ కిట్, డిజైనర్ ఫ్లోర్ మ్యాట్స్ ఉన్నాయి. అదనంగా టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, సెక్యూరిటీ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా జత చేశారు. సేఫ్టీ కోసం డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) విత్ ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ENC), హిల్ హోల్డ్ తోపాటు 12కి పైగా సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి.

Here is Full Details

 

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ లిమిలెడ్ ఎడిషన్ కారు టూ కే సిరీస్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.0 లీటర్ల పెట్రోల్, 1.2 లీటర్ల పెట్రోల్ – డ్యుయల్ జెట్, డ్యుయల్ వీవీటీ విత్ ఐడిల్ స్టార్ట్ స్టాప్ (ఐఎస్ఎస్) టెక్నాలజీస్ ఫీచర్లతో కూడిన ఇంజిన్లు ఉంటాయి. రెండు ఇంజిన్లు మాన్యువల్ ట్రాన్స్ మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిసన్ ఆప్షన్లతో వస్తున్నాయి. 1.0 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ విత్ సీఎన్జీ ఆప్షన్ కలిగి ఉంటుంది. వ్యాగన్ఆర్ వాల్ట్జ్ పెట్రోల్ వేరియంట్ లీటర్ పెట్రోల్ మీద 25.19 కి.మీ మైలేజీ ఇస్తుంది. వ్యాగన్ఆర్ వాల్ట్జ్ సీఎన్జీ వేరియంట్ కిలో సీఎన్జీపై 33.48 కి.మీ మైలేజీ అందిస్తుంది. 2012 నాటికి వ్యాగన్ఆర్ 10 లక్షలు, 2017 నాటికి 20 లక్షలు, 2023 నాటికి 30 లక్సల కార్లు అమ్ముడు పోయాయి. గత ఆర్థిక సంవత్సరంలో మిడ్ హ్యాచ్ బ్యాక్ కార్ల విక్రయాల్లో 61 శాతం వాటా గల వ్యాగన్ ఆర్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 64 శాతానికి పెరుగనున్నది.



సంబంధిత వార్తలు

AP Cabinet Meeting Highlights: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో, జల్ జీవన్ మిషన్ పథకం ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు

Cyclone Fengal Update: తమిళనాడులో ఫెంగల్ తుఫాను విధ్వంసం, రూ. 2వేల కోట్లు మధ్యంతర సాయం ప్రకటించాలని ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ లేఖ, వచ్చే మూడు రోజుల పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడుకు భారీ వర్ష సూచన

Love Betrayal in MP: చనిపోదామని నిర్ణయించుకున్న ప్రేమికులు, ప్రియురాలిని తుపాకీతో కాల్చిన తరువాత మనసు మార్చుకున్న ప్రియుడు, చివరకు ఏమైందంటే..

Cyclone Fengal Update: తీరం దాటినా కొనసాగుతున్న ఫెంగల్ తుఫాను ఎఫెక్ట్, నాలుగు దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, కేరళ వెళ్లే అయ్యప్ప భక్తులకు కీలక అలర్ట్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif