Microsoft Windows Crash: మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్‌తో స్తంభించిన సేవలు, బ్యాంకింగ్,విమానయానంలో తీవ్ర ఇబ్బందులు

మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో లోపం కారణంగా ప్రపంచ దేశాలతో సహా ఢిల్లీ, ముంబై,హైదరాబాద్ సహా పలు విమానాశ్రయాల్లో అంతరాయం ఏర్పడింది.

microsofr crash(ANI)

July 19: మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్‌తో ప్రపంచం స్తంభించిపోయింది. మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో లోపం కారణంగా ప్రపంచ దేశాలతో సహా ఢిల్లీ, ముంబై,హైదరాబాద్ సహా పలు విమానాశ్రయాల్లో అంతరాయం ఏర్పడింది. మొదట అమెరికాకు చెందిన ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్‌లో ఈ సమస్య తలెత్తగా తర్వాత ప్రపంచదేశాల్లోని బ్యాంకులు, ఎయిర్‌ పోర్టుల్లో సేవలు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించి మైక్రోసాఫ్ట్ అనుబంధ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్ స్ట్రైక్ తన తప్పును అంగీకరించింది...

వీలైనంత త్వరగా మా నిపుణులు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. అంతర్జాతీయ ఐటీ సంక్షోభం కారణంగా విమాన సర్వీసులు దెబ్బతిన్నాయని తెలిపింది. విమానయాన సంస్థలు, ఆసుపత్రులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, రైలు సేవలు, ప్రసార సేవలు మొదలైన అనేక రకాల అత్యవసర సేవలు ప్రభావితమయ్యాయి.

ఆరోగ్య సేవలు, బ్యాంకింగ్, విమానయాన సేవలు నిలిచిపోయాయి. ఏపీలోని విశాఖపట్నంలోనూ ప్రభావం పడింది. హైదరాబాద్‌, కోల్‌కతా, ఒడిశా, జయపుర వెళ్లాల్సిన నాలుగు ఇండిగో విమానాలు రద్దయ్యాయినట్లు ఎయిర్‌లైన్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో స్పందించారు పౌర విమానాల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎయిర్‌వేస్‌కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌కి సంబంధించిన అజూర్ అనే క్లౌడ్ సాఫ్ట్‌వేర్‌లో చిన్న సమస్య వచ్చిందని... మన దేశంలో టెక్నికల్ సాఫ్ట్‌వేర్‌ సిస్టం నుంచి మాన్యువల్ సిస్టంలోకి మూవ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. విమానాల ఆలస్యం వల్ల నిలిచిపోయిన ప్రయాణికులకు సీట్లు, ఆహారం, నీరు అందించాలని చెప్పారు. మైక్రోసాఫ్ట్ క్రాష్, విమాన సేవలకు అంతరాయంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు



సంబంధిత వార్తలు