Indian Army Chopper Crash: పాక్‌లో పడిన ఇండియన్‌ క్షిపణి, విచారం వ్యక్తం చేసిన భారత్, ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపిన భారత రక్షణశాఖ

పంజాబ్‌, రాజస్థాన్‌ సరిహద్దు ప్రాంతమైన హర్యానాలోని సిర్సా నుంచి బుధవారం సాయంత్రం ప్రయోగించిన పేలుడు పదార్థంలేని సూపర్‌సోనిక్ క్షిపణి తమ భూభాగంలోని 124 కిలోమీటర్ల పరిధిలో పడిందని పాకిస్థాన్‌ ఆరోపించింది.

missile

New Delhi, March 11: భారత సూపర్‌ సోనిక్‌ నిరాయుధ మిస్సైల్‌ పాకిస్తాన్ భూభాగంలో పేలిన (Indian Army Chopper Crash) సంగతి తెలిసిందే. పంజాబ్‌, రాజస్థాన్‌ సరిహద్దు ప్రాంతమైన హర్యానాలోని సిర్సా నుంచి బుధవారం సాయంత్రం ప్రయోగించిన పేలుడు పదార్థంలేని సూపర్‌సోనిక్ క్షిపణి తమ భూభాగంలోని 124 కిలోమీటర్ల పరిధిలో పడిందని పాకిస్థాన్‌ ఆరోపించింది. భారత క్షిపణి పడిన ప్రాంతం అంత కీలకం కానప్పటికీ దీని వల్ల గోడ కూలిందని పాక్‌ వాయు సేన తెలిపింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని చెప్పింది. ఈ ఘటనపై భారత రక్షణశాఖ కీలక ప్రకటన చేసింది.

9 మార్చి 2022న, భారత క్షిపణి సాధారణ నిర్వహణ సమయంలో, సాంకేతిక లోపం (Missile 'Accidentally Fired) కారణంగా ప్రమాదవశాత్తు పాకిస్తాన్‌ భూభాగంలో ఆ క్షిపణి పేలిందని భారత రక్షణ శాఖ తెలిపింది. భారత ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. ఈ క్షిపణి పాకిస్థాన్‌లోని ఓ ప్రాంతంలో పడిన ఘటన తీవ్ర విచారం కలిగిస్తోందని, ప్రమాదం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం కూడా ఉపశమనం కలిగించే విషయమని పేర్కొంది. అయితే ఈ ప్రమాదంలో భారత పైలట్‌ మృతిచెందగా కో పైలట్‌ గాయాలతో బయటపడ్డారు.

జమ్ముకశ్మీర్‌లో కూలిపోయిన ఆర్మీ చీతా హెలికాప్టర్‌, పైలట్‌, కో పైలట్‌ పారాచూట్‌ ద్వారా బయటపడినట్లు వార్తలు, వారిని గాలిస్తున్న ఆర్మీ రెస్క్యూ బృందాలు

కాగా బుధవారం సాయంత్రం సిస్రా(హర్యానా) వైపు నుంచి సూపర్‌సోనిక్‌ మిస్సైల్‌ ఒకటి 124 కిలోమీటర్ల అవతల పాక్‌ సరిహద్దులో (India Landed in Pakistan Due to Technical Malfunction) కూలిందని పాక్‌ ఆరోపించింది. భారత సరిహద్దు నుంచి వచ్చిన మిస్సైల్‌ అనుమానిత వస్తువును స్వాధీనం చేసుకుంది. కాగా ఈ క్షిపణి 40,000 అడుగుల ఎత్తులో దూసుకెళ్లిందని, పాక్‌ భూభాగంలోని పౌర నివాసాలు, పాక్‌తోపాటు భారత్‌ గగనతలంలోని ప్రయాణ విమానాలకు ముప్పును రేకెత్తించిందని పాకిస్థాన్‌ ఆరోపించింది. ఈ చర్యను ఖండిస్తున్నట్లు పేర్కొంది.