Harsh Vardhan Announced Retirement: రాజకీయాల నుంచి తప్పుకున్న బీజేపీ ఎంపీ, లిస్ట్ లో పేరు లేకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం వెల్లడించిన కేంద్రమాజీ మంత్రి హర్షవర్ధన్

ఆయన స్థానంలో ప్రవీణ్ ఖండేల్వాల్‌కు టికెట్ ఇచ్చింది. దీంతో నిరాశకు గురైన ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ (Gambhir), హజారీభాగ్‌ ఎంపీ జయంత్‌ సిన్హా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పించాలని కోరారు.

Harsh Vardhan Announced Retirement (PIC@ X)

New Delhi, March 03: లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (BJP First List) తొలి విడత జాబితా ప్రకటించింది. అయితే, దేశ రాజధాని ఢిల్లీలోని చాందినీ చౌక్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్న డాక్టర్‌ హర్షవర్ధన్‌ (Harsh Vardhan) రాజకీయాల నుంచి రిటైర్మెంట్‌ (Harsh Vardhan Announced Retirement) ప్రకటించారు. అయితే, ఈ సారి టికెట్ ఇచ్చేందుకు హైకమాండ్ నిరాకరించింది. ఆయన స్థానంలో ప్రవీణ్ ఖండేల్వాల్‌కు టికెట్ ఇచ్చింది. దీంతో నిరాశకు గురైన ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ (Gambhir), హజారీభాగ్‌ ఎంపీ జయంత్‌ సిన్హా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పించాలని కోరారు. తాజాగా మాజీ కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ సైతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

 

డాక్టర్‌ హర్షవర్ధన్‌ దాదాపు సంవత్సరాలకుపైగా రాజకీయాల్లో కొనసాగారు. మొత్తం ఐదుసార్లు అసెంబ్లీ, రెండుసార్లు పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చోటీ గెలుపొందారు. దాంతో పాటు పార్టీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లోనూ కీలక పదవులను చేపట్టారు. ఆయన మళ్లీ తిరిగి డాక్టర్‌ వృత్తిని కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కృష్ణానగర్‌లోని ఈఎన్‌టీ క్లినిక్‌కు తిరిగి వెళ్లేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. 50 సంవత్సరాల కిందట పేదలకు సహాయం అందించాలనే కోరికతో కాన్పూర్‌లోని ఎస్‌ఎస్‌వీఎం మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ అడ్మిషన్‌ తీసుకున్నానని.. ఆ సమయంలో మానవాళికి సేవ చేయడమే నినాదమని పేర్కొన్నారు.

BJP 1st List of 195 Candidates: బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల, 195 సీట్లతో తొలి జాబితా, వారణాసి నుంచి మరోసారి ప్రధాని మోడీ పోటీ..400 సీట్లే లక్ష్యం 

అయితే, అప్పటి ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం అభ్యర్థన మేరకు ఎన్నికల రంగంలోకి వచ్చానన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానాలు, మద్దతు తెలిపిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మూడు దశాబ్దాలకుపైగా సాగిన ప్రయాణానికి ఎంతో దోహదపడ్డారన్నారు. ఇదిలా ఉండగా.. బీజేపీ విడుదల చేసిన తొలి విడత జాబితాలో ఢిల్లీలోని ఐదుస్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో చాందినీ చౌక్‌, న్యూఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ స్థానాలున్నాయి. ఈశాన్య ఢిల్లీ ఎంపీ మనోజ్‌ తివారీ మినహా సిట్టింగ్‌లకు మళ్లీ సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అధిష్ఠానం నిరాకరించింది.



సంబంధిత వార్తలు

Sonu Sood: డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసమే రాజకీయాల్లోకి వస్తారు, సీఎం ఆఫర్ మీద బాలీవుడ్‌ నటుడు సోను సూద్ కీలక వ్యాఖ్యలు

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Tech Layoffs 2024: ఈ ఏడాది భారీగా టెక్ లేఆప్స్, 1,50,034 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన 539 కంపెనీలు, ఏఐ టెక్నాలజీ రావడంతో రోడ్డున పడుతున్న ఉద్యోగులు

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.