CM Siddaramaiah In MUDA land Scam Case: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు షాక్..ముడా కుంభకోణంలో ఆరోపణలు, విచారణకు గవర్నర్ అమోదం
ఈ నేపథ్యంలో ఆరాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Karnataka, Aug 17: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్ తగిలిందిమైసూరు నగరాభివృద్ధి ప్రాదికార (ముడా) కుంభకోణంలో ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తుండగా ఇప్పుడు అది ఏకంగా కర్ణాటక సీఎంకే తాకింది. ఈ నేపథ్యంలో ఆరాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ముడా స్థలం కేటాయింపు కుంభకోణంలో సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతిని ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఇది కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సామాజిక కార్యకర్త, న్యాయవాది టిజె అబ్రహం తన భార్య బీఎం పార్వతికి కేటాయించిన భూమికి సంబంధించిన కేసులో సీఎం సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతివ్వాలని కోరారు.
అయితే ఈ ఎపిసోడ్ జరుగుతుండగానే తనపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ ను గవర్నర్ తిరస్కరిస్తారని సీఎం సిద్ధరామయ్య విశ్వాసం వ్యక్తం చేశారు.
అయితే గవర్నర్ నిర్ణయంతో రాజ్ భవన్, ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. టార్గెట్ కేటీఆర్ - హరీష్ రావు, కాంగ్రెస్ వ్యూహం ఇదేనా?, కాంగ్రెస్ కేడర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన గీతోపదేశం ఏంటీ?
ఇక ఇవాళ సాయంత్రం 5గంటలకు జరిగే కేబినెట్ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గవర్నర్ విచారణకు అనుమతించిన నేపథ్యంలో సిద్దరామయ్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉండగా ఇది ఖచ్చితంగా పొలిటికల్ వార్‌గా మారనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.