Mumbai: కొంపలు ముంచిన సమోసాల బిల్లు, రూ.1.40 లక్షలు ఆన్‌లైన్‌లో పోగొట్టుకున్న వైద్యుడు, లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
25 ప్లేట్ల సమోసాలు ఆర్డర్ చేసి.. ఏకంగా రూ.1.40 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ముంబైలోని సియోన్ (Sion) ప్రాంతంలో గత శనివారం ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల మధ్య చోటు చేసుకుంది.
Doctor Loses Rs 1.40 Lakh to Online: ముంబైకి చెందిన వైద్యుడు (Mumbai doctor) ఆన్ లైన్ లో సమోసాలు (samosas) ఆర్డర్ చేసి దారుణంగా మోసపోయాడు. 25 ప్లేట్ల సమోసాలు ఆర్డర్ చేసి.. ఏకంగా రూ.1.40 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ముంబైలోని సియోన్ (Sion) ప్రాంతంలో గత శనివారం ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల మధ్య చోటు చేసుకుంది.
పోలీసులు, మోసపోయిన వైద్యుడు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని కేఈఎమ్ ఆసుపత్రికి (KEM hospital) చెందిన 27 ఏళ్ల వైద్యుడు తన స్నేహితులతో కలిసి పిక్నిక్ కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ప్రయాణం మధ్యలో తినేందుకు స్నాక్స్ తీసుకోవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో సియోన్ ప్రాంతంలో గల ప్రముఖ హోటల్ కు ఫోన్ చేసి 25 ప్లేట్ల సమోసాలు ఆర్డర్ ఇచ్చాడు.
వీడియో ఇదిగో, తొలి ఏఐ యాంకర్ లీసా వచ్చేసింది, అవలీలగా వార్తలు చదివేస్తున్న మిషన్ లేడీ
ఇందుకోసం రూ.1500 చెల్లించాలంటూ అటువైపు వారు వైద్యుడికి సూచించారు. ఈ మేరకు ఓ నంబర్ పంపారు. వారు చెప్పిన నంబర్ కు వైద్యుడు రూ.1500 ట్రాన్స్ ఫర్ చేశాడు. అనంతరం కొద్దిసేపటికే వైద్యుడికి తిరిగి ఫోన్ వచ్చింది. తమకు పేమెంట్ అందలేదని.. మరో నంబర్ కు మనీ ట్రాన్స్ ఫర్ చేయాలని వేరే నంబర్ ఇచ్చారు. దాంతో పాటు పేమెంట్ రిక్వెస్ట్ లింక్ కూడా పంపారు. వారు చెప్పింది నమ్మిన వైద్యుడు ఆ లింక్ క్లిక్ చేసి పేమెంట్ చేశాడు.
ఇది జరిగిన కొద్ది నిముషాలకు డాక్టర్ ఖాతా నుంచి రూ.28 వేలు కట్ అయ్యాయి. ఇది చూసిన డాక్టర్ కంగుతిన్నారు. కొద్దిసేపటికి తన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్లు మూడు సార్లు మెసేజ్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన వైద్యుడు బ్యాంకుకు ఫోన్ చేసి బ్లాక్ చేయించారు. అయితే అప్పటికే ఆయన ఖాతాలోని రూ.1.40 లక్షలను మోసగాళ్లు స్వాహాచేశారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.వైద్యుడి ఫిర్యాదు మేరకు ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.