Mumbai Genie Theft Case: ఏడాదిగా ఇంట్లో వరుస చోరీలు, భూతం తీసుకుంటుంది కావొచ్చని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వని కుటుంబం, ఇప్పటి వరకు రూ.40లక్షల విలువైన గోల్డ్ చోరీ, అసలు దొంగ ఎవరంటే?

ఈ క్రమంలో నగలు, డబ్బు ఇంట్లోని వాళ్లే తీసినట్లు గుర్తించారు. వాళ్లింట్లో ఉంటున్న మేనకోడలే ఈ డబ్బు తీసుకున్నట్లు గుర్తించారు. ఆ కుటుంబంలో అందరినీ విచారించగా పోలీసులకు అసలు విషయం తెలిసింది.

ghost Representational Image (Photo Credits: Pixabay)

Mumbai, OCT 13: ఎవరైనా ఇంట్లో చిన్న వస్తువు కనిపించకుండా పోతేనే అది ఏమైందోనని కంగారు పడతారు. అలాంటిది బంగారం, నగలు పోతే? ఇల్లంతా వెతుకుతారు. అందరినీ అడుగుతారు. చివరగా పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. కానీ, ముంబైలో (Mumbai) మాత్రం ఒక కుటుంబం తమ ఇంట్లో నగలు నిత్యం చోరీకి (theft) గురవుతున్నా పట్టించుకోలేదు. ఏమీ జరగనట్లే ఉండిపోయారు. దీనికి గల కారణం తెలిసి నోరెళ్లబెట్టారు పోలీసులు. ముంబైలోని బైకుల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కుటుంబం నివసిస్తోంది. అదే ఇంట్లో వారి మేనకోడలు కూడా ఉంటోంది. అయితే, దాదాపు ఏడాది నుంచి వాళ్ల ఇంట్లో నగలు చోరీకి గురవుతూనే ఉన్నాయి. అలా అనేకసార్లు కలిపి దాదాపు రూ.40 లక్షల విలువైన నగలు (Jewelry) చోరీకి గురయ్యాయి. కానీ, ఆ కుటుంబం ఈ విషయం తెలిసినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కారణం.. ఆ నగల్ని వాళ్ల ఇంట్లో ఉంటున్న భూతమో, దెయ్యమో తీసుకుంటుందని నమ్మడమే.

Kerala Human Sacrifice Case: కేరళ నరబలి కేసు, నిందితులను రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీకి పంపిన కోర్టు, కక్కనాడ్ జైలుకి నిందితులు 

తమ ఇంట్లోని భూతాలు (Ghost), దెయ్యాలే ఆ నగలు తీసుకుంటున్నాయని, ఆ విషయం ఎవరికైనా చెబితే ప్రమాదమని భావించి వాటి గురించి ఎవరికీ చెప్పలేదు ఆ కుటుంబం. చివరకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. ఎన్నిసార్లు నగలుపోయినా అలాగే చూస్తూ ఉండిపోయారు. అయితే, ఇటీవల వాళ్లింట్లో పది లక్షల డబ్బు (Money) కూడా మాయమైంది. దీంతోపాటు మరో నాలుగు లక్షల నగలు కూడా పోయాయి. ఎప్పుడూ నగలే చోరీకి గురయ్యేవి. కానీ, ఈసారి డబ్బు కూడా పోవడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరిగా పోయిన రూ.10 లక్షల నగదు, నాలుగు లక్షల బంగారం గురించే ఫిర్యాదు చేశారు. దెయ్యాల మీద ఉన్న భయంతో అంతకుముందు పోయిన వాటి గురించి చెప్పలేదు.

Human Sacrifice in Kerala: ఇంట్లోనే కుద్ర పూజలు చేసి ఇద్దరు మహిళల గొంతుకోసి చంపిన దంపతులు, మృతదేహాలను ముక్కలుగా నరికి ఇంటి బయట పాతిపెట్టారు, కేరళలో దారుణ ఘటన వెలుగులోకి.. 

అయితే, దీనిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. ఈ క్రమంలో నగలు, డబ్బు ఇంట్లోని వాళ్లే తీసినట్లు గుర్తించారు. వాళ్లింట్లో ఉంటున్న మేనకోడలే ఈ డబ్బు తీసుకున్నట్లు గుర్తించారు. ఆ కుటుంబంలో అందరినీ విచారించగా పోలీసులకు అసలు విషయం తెలిసింది. వాళ్లింట్లో చాలా కాలం నుంచి నగలు పోతున్నాయని, కానీ, దెయ్యాలు, భూతాల మీద ఉన్న నమ్మకంతో వాటి గురించి ఎవరికీ చెప్పలేకపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తిగా విచారణ జరిపిన పోలీసులు వారి మేన కోడల్ని ప్రశ్నించగా, ఆ నగలన్నీ తానే తీసినట్లు, గుజరాత్, సూరత్‌లో ఉన్న ఇద్దరు బంధువులకు ఇచ్చినట్లు చెప్పింది. పోలీసులు మేన కోడలితోపాటు, నగలు తీసుకున్న ఇద్దరినీ అరెస్టు చేశారు. వారి నుంచి దాదాపు రూ.40 లక్షల విలువైన నగల్ని స్వాధీనం చేసుకున్నారు.



సంబంధిత వార్తలు

Hyderabad: ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా.. హయత్‌నగర్‌లో అమ్మాయికి బెదిరింపులు,బలవంతంగా అత్యాచారం చేశాడని బాధితురాలి ఆవేదన..వీడియో ఇదిగో

Fake Cop Video Calls Real Cyber Security Police: సైబ‌ర్ క్రిమిన‌ల్ కు లైవ్ లో షాక్ ఇచ్చిన పోలీసులు, యూనిఫాంతో ఏకంగా రియ‌ల్ పోలీస్ కే ఫోన్ చేసిన కేటుగాడు.. ఆ త‌ర్వాత ఏమైందంటే?

Revanth Reddy Vs KTR: తెలంగాణ రాజకీయాలు హస్తినకు...ఫార్ములా ఈ రేసు కేసులో ఢిల్లీ పెద్దల అనుమతి లభించేనా?, గవర్నర్ ఢిల్లీ టూర్ వెనుక మర్మం ఇదేనా?

Kodangal Lagacherla Incident: ఏ1గా బోగమోని సురేష్, లగిచర్ల ఘటనపై పోలీసుల రిమాండ్ రిపోర్ట్, పథకం ప్రకారమే దాడి చేశారని వెల్లడి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్, ఎంపీ డీకే అరుణను అడ్డుకున్న పోలీసులు