Jani Master Case Update: జానీ మాస్టర్‌కు మరో షాక్, ఐదురోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ నార్సింగి పోలీసులు కోర్టులో పిటిషన్, విచారణ రేపటికి వాయిదా
ఇటీవల జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు అతనిని (Jani Master Case Update) హైదరాబాద్‌కు తరలించి, కోర్టులో హాజరుపరిచారు.
లైంగిక వేధింపుల ఆరోపణల్లో అరెస్టయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నార్సింగి పోలీసులు రంగారెడ్డి కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు అతనిని (Jani Master Case Update) హైదరాబాద్‌కు తరలించి, కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. తాజాగా, నార్సింగి పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసిన తర్వాత... కోర్టులో హాజరుపరచడానికి ముందు కూడా పోలీసులు అతనిని విచారించారు. అయితే మరిన్ని వివరాలు రాబట్టేందుకు తమ కస్టడీకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.
నార్సింగి పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఐదురోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో పోలీసులు కోరారు. పోక్సో కేసు కావడంతో కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మరో వైపు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.జానీ పిటిషన్‌పై విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు, లైంగిక దాడి చేసినట్లు ఒప్పుకున్న జానీ మాస్టార్!
ప్రస్తుతం జానీ మాస్టర్ చర్లపల్లి జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో జానీని కస్టడీకి ఇస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. లైంగిక వేధింపులు, పోక్సో కేసుతో జానీ మాస్టర్ పరారీలో ఉండగా.. ఈ నెల 19న సైబరాబాద్ పోలీసుల బృందం గోవాలో అరెస్టు చేసింది. ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలించి.. విచారణ అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ని విధించింది.