Stock Market Highlights: రూపాయి ఢమాల్, వరుసగా ఐదో రోజలు లాభాలకు బ్రేక్, నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగిన సూచీలు ఆఖరి క్షణాల్లో కాస్త నష్టాల నుంచి కాస్త తేరుకున్నాయి. కాగా సెన్సెక్స్‌లో ఐదు సెషన్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 335 పాయింట్ల నష్టంతో 60507 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు నష్టంతో17764 వద్ద ముగిసాయి.
దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోనే ముగిసాయి. రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగిన సూచీలు ఆఖరి క్షణాల్లో కాస్త నష్టాల నుంచి కాస్త తేరుకున్నాయి. కాగా సెన్సెక్స్‌లో ఐదు సెషన్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 335 పాయింట్ల నష్టంతో 60507 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు నష్టంతో17764 వద్ద ముగిసాయి.
ఐటీ షేర్లు నష్టపోగా అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్, బీపీసీఎల్, టాప్ విన్నర్స్‌గా నిలిచాయి. దివీస్, హిందాల్కో, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, వేదాంత టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరుమారకంలో రూపాయి సెప్టెంబర్ 22 తర్వాత అతిపెద్ద నష్టాన్ని నమోదు చేసింది. 1.10 నష్టంతో 82. 72 వద్ద ముగిసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నాలుగు శాతం పెరిగి 42 శాతానికి చేరనున్న డీఏ!
అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ మినహా అదానీ గ్రూప్‌నకు చెందిన మిగిలిన అన్ని షేర్లు నేడు లోయర్ సర్క్యూట్‌ని తాకాయి. ఈ రోజు ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, ఐటీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా స్టీల్, ఇన్ఫోసిస్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, విప్రో, రిలయన్స్, మారుతీ షేర్లు నష్టాల్లో ముగిశాయి.