Nirbhaya Case: నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉరి, అమలు తేదీని పొడగిస్తూ తాజాగా తీర్పు వెలువరించిన దిల్లీ కోర్ట్, సుప్రీంకోర్టులో కొత్త పిటిషన్ వేసిన మరో దోషి, వ్యవస్థపై విచారం వ్యక్తం చేసిన నిర్భయ తల్లి

ఏదేమైనా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వారి క్షమాభిక్షను తిరస్కరించినప్పటికీ నిబంధనల ప్రకారం దోషులకు 14 రోజుల నోటీసు ఇవ్వవలసి ఉంటుందని తిహార్ జైలు అధికారులు బుధవారం కోర్టుకు తెలియజేయడంతో కొత్త డెత్ వారెంట్ జారీ చేయాల్సిన అవసరం......

Convicts to be executed on Feb 1 | File Image

New Delhi, January 17:  అనుకున్నట్లే జరిగింది.  2012 నిర్భయ కేసులో (Nirbhaya gangrape-murder case) దోషులకు విధించిన ఉరిశిక్ష అమలు తేదీ మారింది. గతంలో ఇచ్చిన డెత్ వారెంట్ (Death Warrant) యొక్క ముందస్తు ఉత్తర్వులను రద్దు చేస్తూ దిల్లీ కోర్ట్ (Delhi Court)  తాజాగా మరోసారి డెత్ వారెంట్ జారీ చేరీ చేసింది. తాజా జ్యుడిషియల్ ఉత్తర్వుల ప్రకారం, ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టు తీర్పు వెలువరించింది.

ఉరిశిక్ష రద్దుపై అన్ని రకాల న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకొని జనవరి 22న ఉరిశిక్ష అమలు తేదీ ఖరారైన తర్వాత దోషుల్లో ఒకరైన ముఖేశ్ సింగ్ రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం అభ్యర్థించాడు. ఏదేమైనా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వారి క్షమాభిక్షను తిరస్కరించినప్పటికీ నిబంధనల ప్రకారం దోషులకు 14 రోజుల నోటీసు ఇవ్వవలసి ఉంటుందని తిహార్ జైలు అధికారులు బుధవామే కోర్టుకు తెలియజేయడంతో కొత్త డెత్ వారెంట్ జారీ చేయాల్సిన అవసరం అనివార్యమైంది. దీంతో తాను పెట్టుకున్న రాష్ట్రపతి  క్షమాభిక్ష రద్దు చేయబడింది అని ముఖేశ్‌కు సమాచారం ఇచ్చిన తర్వాత దిల్లీ కోర్టు తాజాగా మరోసారి డెత్ వారెంట్ జారీచేసింది.

మరోవైపు ఈ కేసులో ఉరిశిక్ష పడిన పవన్ గుప్తా అనబడే మరో దోషి ఘటన జరిగిన సమయంలో తాను మైనర్ అని, కాబట్టి జువైనల్ చట్టం ప్రకారం తనపై విచారణ జరపాల్సి ఉంటుందని తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు.

ఇక ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో నిర్భయ తల్లి ఆశా దేవి తల్లడిల్లిపోయారు. న్యాయ వ్యవస్థలోని లొసుగులను ఉపయోగించుకుంటూ దోషులు ఉరిశిక్ష నుంచి దూరంగా జరుగుతున్నారని ఆమె ఆరోపించారు. భారతదేశంలోని వ్యవస్థలు బాధితుల కంటే నేరం చేసిన దోషుల వాదనలే వింటాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ రాజధాని దిల్లీలో  2012, డిసెంబర్ 16న రాత్రి బస్సులో ప్రయాణిస్తున్న నిర్బయపై మొత్తం 6 మంది కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ, ఇనుప రాడ్లతో ఆమెపై అమానవీయ చర్యలకు పాల్పడ్డారు. ఆ ఆరుగురిని జైలుకు తరలించగా అందులో ఒకడు మైనర్ కావడంతో 3 సంవత్సరాల జైలు శిక్ష అనంతరం బయటకు వచ్చాడు. మరొకరు రామ్ సింగ్ ఒక ఏడాది తర్వాత జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక మిగిలిన నలుగురు వినయ్ శర్మ, అక్షయ్ సింగ్, ముఖేష్ సింగ్, పవన్ గుప్తాలకు  గత ఏడాది సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. అప్పట్నించీ వారి ఉరితీత అమలులో ఎన్ని పరిణామాలు, ఎన్ని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయో తెలిసిందే.