Vartika Singh: నా రక్తంతో రాస్తున్నా, వారిని ఉరి తీసే అవకాశం నాకివ్వండి, హోం మంత్రి అమిత్ షాను కోరిన ఇంటర్నేషనల్ షూటర్ వర్తిక సింగ్, త్వరలో నిర్భయ నిందితులని ఉరి తీసే అవకాశం
ఆ ఘటన తర్వాత ఈ నెలలో తెలంగాణాలో జరిగిన దిశ ఘటన (Disha Rape Murde case) దేశాన్ని కుదిపేసింది. ఈ ఘోరమైన ఘటనలే కాకుండా ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, ఆపై హత్యలు పెరిగిపోతూ ఉన్నాయి.
New Delhi, December 15: 2012 డిసెంబరులో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన (Nirbhaya gang-rape case) దేశ వ్యాప్తంగా తీవ్ర పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటన తర్వాత ఈ నెలలో తెలంగాణాలో జరిగిన దిశ ఘటన (Disha Rape Murde case) దేశాన్ని కుదిపేసింది. ఈ ఘోరమైన ఘటనలే కాకుండా ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, ఆపై హత్యలు పెరిగిపోతూ ఉన్నాయి.
మహిళల భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మహిళల భద్రతపై అన్ని పార్టీలు, సెలబ్రిటీలు, సామాన్యులు ఏకమై గళం విప్పుతున్నాయి. నిర్భయ ఘటనలో నిందితులను ఇంకా జైళ్లలో మేపడం ఏంటీ.. వెంటనే వారిని ఉరి తీయాలంటూ అందరూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే నిర్భయ కేసులో (Nirbhaya rape and murder case)శిక్షను అనుభవిస్తున్న దోషులను తన చేతులతో ఉరి తీసే అవకాశం ఇవ్వాలంటూ అంతర్జాతీయ షూటర్ వర్తిక సింగ్(International shooter Vartika Singh) కేంద్ర హోంమంత్రి అమిత్ షాను(Amit Shah) కోరారు.
ANI Tweet:
ఇది నా రక్తంతో రాస్తున్నా! నిర్భయ హత్య కేసు దోషులను నా చేతులతో ఉరి తీసే అవకాశం కల్పించండి. దీనిద్వారా దేశంలో ఒక మహిళ కూడా ఉరిశిక్షను అమలు చేయగలదనే సందేశాన్ని సమాజానికి చెప్పాలనుకుంటున్నా అని వర్తిక సింగ్ లేఖలో పేర్కొన్నారు.
కాగా 2012 డిసెంబర్ 16న అతి కిరాతకరంగా అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేసిన దోషులు ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. త్వరలోనే వీరిని ఉరి తీయనున్నారు. ఈ నేపథ్యంలో తనకు వారిని ఉరి తీసే అవకాశం కల్పించాలని కోరుతూ వర్తిక సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రక్తంతో లేఖను రాశారు. ఇదిలా ఉంటే 'దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసు అనంతరం నిర్భయ దోషులను బహిరంగంగా ఉరి తీయాలనే డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా నిర్భయ దోషులను ఉరి తీయడానికి 10 తాళ్లను సిద్ధం చేయాలని బీహార్‌లోని బుక్సర్ జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంతకు ముందు 2001లో పార్లమెంటుపై ఉగ్రదాడికి పాల్పడిన అఫ్జల్ గురు, సీరియల్ కిల్లర్ ధనుంజయ్ చటర్జీ, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి యాకుబ్ మీనన్, 2008 ఉగ్రదాడిలో పాల్గొన్న అజ్మల్ కసబ్‌లను బుక్సర్ జైలు నుంచి తెప్పించిన తాళ్లతోనే ఉరి తీశారు.