Nirmala Sitharaman Press Meet: ఐటీ రిటర్నుల గడువు పెంపు, జీఎస్టీ చెల్లింపుల గడువు పెంపు మొదలుకొని కరోనావైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో పలు కీలక ప్రకటనలు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హైలైట్స్ చూడండి

ప్రస్తుతం ఆరోగ్య సంక్షోభం నేపథ్యంలో కలిగే నష్టాలపై కొంత భారం తగ్గించడానికి ఆర్థిక ప్యాకేజీని.....

Union FM Nirmala Sitharaman. (Photo Credit: PTI)

New Delhi, March 24:  కరోనావైరస్ వ్యాప్తితో దేశమంతా 'లాక్ డౌన్'  (Coronavirus- Lockdown) పరిస్థితులు నెలకొన్న సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman) మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. ప్రస్తుతం ఆరోగ్య సంక్షోభం నేపథ్యంలో కలిగే నష్టాలపై కొంత భారం తగ్గించడానికి ఆర్థిక ప్యాకేజీని (Economic Relief Package) త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. "అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి త్వరలోనే ఆర్థిక ప్యాకేజీతో ముందుకు రాబోతున్నాము, త్వరలోనే వాటి వివరాలు ప్రకటించబడతాయి" అని సీతారామన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందుకు చట్టబద్ధమైన సమగ్ర ప్రణాళికను రూపొందించిందని పేర్కొన్నారు.

ఇక లాక్‌డౌన్ కారణంగా అన్ని మూతపడిన నేపథ్యంలో ఆదాయపు పన్ను, జీఎస్‌టి, కస్టమ్స్ మరియు సెంట్రల్ ఎక్సైజ్, కార్పొరేట్ వ్యవహారాలు, ఇన్సోల్వెన్సీ మరియు బ్యాంక్రప్సీ కోడ్, మత్స్య మరియు బ్యాంకు సంబంధిత అంశాలకు సంబంధించి గడువును పొడగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించారు. 18-19 ఆర్థిక సంవత్సరానికి గానూ ఐటీ రిటర్నుల (Income Tax Returns) గడువును జూన్ 30, 2020 వరకు పొడగించినట్లు తెలిపారు.

నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:

 

వీటితో పాటు ఏ బ్యాంకుకు సంబంధించి డిబెట్ కార్డు ద్వారా అయినా ఏటీఎం విత్ డ్రాలకు సంబంధించి 3 నెలల పాటు ఎలాంటి ఛార్జీలు వర్తించబోవని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అలాగే 'మినిమం బ్యాలెన్స్' లేకపోయినా పర్వాలేదని ఆర్థిక మంత్రి చెప్పారు.  మహారాష్ట్రలో 100 దాటిన కరోనావైరస్ కేసులు, దేశవ్యాప్తంగా 492 కేసులు నమోదు

వ్యాపార, వాణిజ్య, ఫైనాన్స్ వినియోగదారులందరికీ బ్యాంకుల ఛార్జీలు తగ్గించినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.

ఇప్పుడున్నటు వంటి పరిస్థితులే మరో ఆరు నెలలు కొనసాగితే ఇన్సాల్వెన్సీ మరియు బ్యాంక్రప్ట్సీ (ఐబిసి) లోని సెక్షన్ 7, 9 మరియు 10 లను సస్పెండ్ చేయడాన్ని పరిశీలిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.