Nithyananda: నన్ను ఏ మగాడు టచ్ చేయలేడు, నేను పరమ శివుడ్ని, వైరల్ అవుతున్న సెల్ప్ గాడ్ నిత్యానంద వీడియో, పాస్‌పోర్ట్ రద్దు చేసిన విదేశాంగ శాఖ, ఈక్విడార్ దీవి వాస్తవం కాదన్న ఈక్విడార్ రాయబార కార్యాలయం

కర్ణాటక (Karnataka)లో ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకొని... రేపులు, అరాచకాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద(Nithyananda) ఇప్పుడు ఎక్కడున్నాడు? రేపు ఎక్కడుంటాడు? అనే దానిపై ఎవరికీ సమాచారం లేదు. కొన్నాళ్ల క్రితం నేపాల్‌ (Nepal) మీదగా విదేశాలకు పారిపోయాడు. చాలాకాలం ఎక్కడ ఉన్నాడో కూడా తెలియకుండా వ్యవహారాలు నెట్టుకు వచ్చాడు.

Rape-accused godman Nithyananda. (Photo Credit: Twitter video)

New Delhi, December 8: కర్ణాటక (Karnataka)లో ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకొని... రేపులు, అరాచకాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద(Nithyananda) ఇప్పుడు ఎక్కడున్నాడు? రేపు ఎక్కడుంటాడు? అనే దానిపై ఎవరికీ సమాచారం లేదు. కొన్నాళ్ల క్రితం నేపాల్‌ (Nepal) మీదగా విదేశాలకు పారిపోయాడు. చాలాకాలం ఎక్కడ ఉన్నాడో కూడా తెలియకుండా వ్యవహారాలు నెట్టుకు వచ్చాడు.

దేశం వదిలి పారిపోయిన ఈ స్వయం ప్రకటిత దేవుడు (self-styled godman) తనను ఎవ్వరూ టచ్ చేయలేరంటూ చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వీడియోలో నిత్యానంద తన ఎదురుగా కూర్చున్నవారిని ఉద్దేశించి మాట్లాడుతూ నన్నుఎవ్వరూ టచ్ చేయలేరు(Nobody Can Touch Me). ఏ స్టూపిడ్ కోర్టు నన్ను ప్రాసిక్యూట్ చేయలేదు. నేను పరమశివుడిని(I Am Param Shiva). నేను నిజం చెప్పగలను. మీ ముందు నా నిజాయితీని నిరూపించుకోగలను అంటూ ఆయన మాట్లాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో(Social Media) వైరల్ గా మారింది.

Here's the Viral Video:

ఈక్వెడార్‌(Ecuador)లో ఓ దీవి(island)ని కొనుక్కుని ప్రత్యేక సామ్రాజ్యాన్ని నెలకొల్పే ప్రయత్నంలో ఉన్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈక్వెడార్‌ నుంచి తాను ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి దానికి కైలాస(Kailaasa) అనే పేరుపెట్టినట్టు ఇటీవల నిత్యానంద ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఓ వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.

కైలాస అనేది రాజకీయేతర హిందూ దేశమని, హిందూత్వ పునరుద్ధరణ కోసం కృషి​ చేస్తోందని అందులో తెలిపారు. అయితే అక్కడ ఉన్నదీ, లేనిదీ కచ్చితంగా తెలియకున్నా తన శిష్యగణాన్ని ఉద్దేశించి విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది.

ఇదిలా ఉంటే ఈక్వెడార్‌ నుంచి నిత్యానంద ద్వీపం కొనుగోలు చేసాడని వస్తున్న వార్తలపై భారత్ లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయం స్పందించింది. తాము నిత్యానందకు ఏ దీవినీ అమ్మలేదని, తాను కొత్త దేశాన్నే సృష్టించానని చెప్పుకునే నిత్యానందకు అంత సీన్‌ కూడా లేదని ఈక్వెడార్‌ స్పష్టం చేసింది.

తాను ఆశ్రయం పొందేందుకు నిత్యానంద పెట్టుకున్న శరణార్థి దరఖాస్తును కూడా తాము తిరస్కరించినట్లు ఈక్వెడార్‌ స్పష్టం చేసింది. రేప్‌ కేసులో నిందితుడిగా ఉన్న నిత్యానంద విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారని కర్ణాటక, కేంద్ర ప్రభుత్వాలను పలువురు నిలదీస్తున్నారు.

మరోవైపు నిత్యానంద పాస్‌పోర్ట్‌ రద్దు చేసినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. గత నెల నుంచి కనబడకుండా పోయిన నిత్యానంద ఆచూకీని కనుగొనేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని విదేశాంగశాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. అలాగే కొత్త పాస్‌పోర్ట్‌కై అతను పెట్టుకున్న దరఖాస్తు పోలీసు క్లియరెన్స్ పొందకపోవడంతో పెండింగ్‌లో ఉందన్నారు.

నిత్యానంద కైలాస దేశంపై స్పందిస్తూ.. ఒక దేశం ఏర్పాటు చేయడం వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసినంత సులువైన పని కాదని అన్నారు. నిత్యానంద గురించి ఏదైనా సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని విదేశీ ప్రభుత్వాలను కోరినట్లు రవీష్ తెలిపారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement