Rs 2000 Note Exchange Deadline: రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ గడువు పొడిగించే ప్రశ్నే లేదు, సెప్టెంబర్ 30 లోగా మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేసిన కేంద్రం
2వేలు నోట్లను ఉపసంహరించుకోవడంపై కేంద్ర మరో కీలక ప్రకటన చేసింది.రూ. 2000 నోట్ల ఉపసంహరణకు సంబంధించి గడువు పొడిగిస్తారా? అనే ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బదులిస్తూ పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేసింది.
No Plan To Extend Deadline For Exchange Of Rs 2000 Notes: భారతదేశంలో రూ. 2వేలు నోట్లను ఉపసంహరించుకోవడంపై కేంద్ర మరో కీలక ప్రకటన చేసింది.రూ. 2000 నోట్ల ఉపసంహరణకు సంబంధించి గడువు పొడిగిస్తారా? అనే ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బదులిస్తూ పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేసింది. కావున నిర్దిష్ట గడువు లోపల తప్పకుండా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలి.. లేదా ఎక్స్‌చేంజ్ చేసుకోవాలి. ఇప్పటికే వెల్లడించిన గడువు (సెప్టెంబర్ 30) లోపల ఎవరైనా తమ వద్దే రెండు వేల నోట్లను అలాగే పెట్టుకుని ఉంటే నష్టపోవాల్సింది మీరే అని కూడా స్పష్టం చేసింది.
ఇప్పటి వరకు సుమారు రూ. 2.72 లక్షల కోట్ల విలువైన రెండు వేల నోట్లు వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రజల వద్ద ఇంకా రూ. 2000 నోట్లు ఉన్నాయని, వాటిని కూడా వీలైనంత త్వరగా మార్చుకోవాలని సూచిస్తోంది. గడువు పెంపులో మార్పు లేదు కావున ప్రజలు తప్పకుండా తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోవాలి / ఎక్స్‌చేంజ్ చేసుకోవాలని కోరింది.