Eknath Shinde: ఎండలో డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను చూసి చలించిపోయిన సీఎం, ఇకపై 55 ఏళ్లు దాటిని ట్రాఫిక్ పోలీసులకు రోడ్లపై డ్యూటీ వేయొద్దు, కీలక నిర్ణయం తీసుకున్న మహా సీఎం షిండే
ఇక మహారాష్ట్రలో గత నెలన్నరగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఇప్పటికే పలువురు వడదెబ్బ (Summer) తగిలి చనిపోయారు. ఈ నేపథ్యంలో రోడ్లపై డ్యూటీ చేసే ట్రాఫిక్ పోలీసుల (traffic cops) విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde).
Mumbai, May 18: దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఇక మహారాష్ట్రలో గత నెలన్నరగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఇప్పటికే పలువురు వడదెబ్బ (Summer) తగిలి చనిపోయారు. ఈ నేపథ్యంలో రోడ్లపై డ్యూటీ చేసే ట్రాఫిక్ పోలీసుల (traffic cops) విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde). ట్రాఫిక్ విభాగంలోని 55 ఏండ్లు దాటిన వారికి రోడ్లపై డ్యూటీ వేయొద్దని ఆదేశాలు జారీ చేశారు షిండే. ఈ మేరకు సీపీ వివేక్ ఫన్సల్కర్‌కు మార్గదర్శకాలు ఇచ్చారు. డ్యూటీలో ఉన్న పోలీసులకు తాగునీటితో పాటూ, నీడను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాదు ఎండలో డ్యూటీ చేసే పోలీసులకు (traffic cops) కావాల్సిన సదుపాయాల కోసం అవసరమైతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఫండ్స్ ఇస్తామన్నారు.
ఇటీవల థానే నుంచి ముంబై వెళ్తుండగా సీఎం షిండే ఓ ట్రాఫిక్ పోలీసు ఎండలో డ్యూటీ చేయడం చూశారు. 50 దాటిన ఆ పోలీసు ఎండలో డ్యూటీ (Aged traffic cops) చేయడంపై చలించిపోయిన షిండే...తక్షణమే ఉన్నతాధికారులను పిలిచి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటికే ఎండల తీవ్రత కారణంగా మద్యాహ్నం పూట సభలకు అనుమతి నిరాకరిస్తున్నారు. రోజువారీ కూలీల సమయం కూడా మార్చారు.