Narne Nithiin Engagement: టాలీవుడ్ యంగ్ హీరో నిశ్చితార్ధం, ఫ్యామిలీతో సహా హాజరైన ఎన్టీఆర్, ఎంత సందడి చేశారో చూడండి!
మ్యాడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ కొట్టి ఇటీవలే ఆయ్ సినిమాతో ఇంకో హిట్ కొట్టాడు. త్వరలో నార్నె నితిన్ మ్యాడ్ 2 సినిమాతో రాబోతున్నాడు. అయితే తాజాగా ఈ హీరో నిశ్చితార్థం చేసుకున్నాడు.
Hyderabad, NOV 03: ఎన్టీఆర్ భార్య ప్రణతి సోదరుడు, ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మ్యాడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ కొట్టి ఇటీవలే ఆయ్ సినిమాతో ఇంకో హిట్ కొట్టాడు. త్వరలో నార్నె నితిన్ మ్యాడ్ 2 సినిమాతో రాబోతున్నాడు. అయితే తాజాగా ఈ హీరో నిశ్చితార్థం చేసుకున్నాడు. నార్నె నితిన్ నిశ్చితార్థం శివాని తాళ్లూరి అనే అమ్మాయితో నేడు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల మధ్య ఈ నిశ్చితార్థం జరిగింది. అయితే బామ్మర్ది నిశ్చితార్థానికి ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి వచ్చాడు.
NTR Attended Hero Narne Nithiin Engagement
ఎన్టీఆర్, భార్య లక్ష్మి ప్రణతి, ఇద్దరు కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో ఎన్టీఆర్ వచ్చారు. నార్నె నితిన్ నిశ్చితార్థంలో ఎన్టీఆర్ ఫ్యామిలీతో సందడి చేయగా ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వరుస హిట్స్ కొడుతున్న నితిన్ కు నిశ్చితార్థం సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.