Odisha: మహిళ ఆ భాగాలను తాకుతూ పోలీస్ ఉన్నతాధికారి అసభ్య ప్రవర్తన, చర్యలు తీసుకుంటామని తెలిపిన ఒడిశా జిల్లా అదనపు మెజిస్ట్రేట్
ఇటీవల ఒడిశాలో వార్తలు సేకరించేందుకు వెళ్లిన ఓ జర్నలిస్టును (ASP beats journalist) ఏఎస్పీ కొట్టారు
Papadahandi, Sep 16: ఒడిషాలోని నవరంగపూర్ జిల్లాలో పోలీసు ఉన్నతాధికారి రెచ్చిపోయాడు.మహిళపై లింగ వివక్షతో కూడిన వ్యాఖ్యలకు దిగాడు.వివరాల్లోకెళితే.. ఇటీవల ఒడిశాలో వార్తలు సేకరించేందుకు వెళ్లిన ఓ జర్నలిస్టును (ASP beats journalist) ఏఎస్పీ కొట్టారు. ఈ సంఘటన బుధవారం నబరంగ్‌పూర్ జిల్లాలోని పాపాహండి పోలీస్ స్టేషన్ (Papadahandi Police Station) ఆవరణలో చోటుచేసుకుంది. బార్‌ఘర్ ప్రాంతానికి చెందిన వివాహిత పాపాహండి ప్రాంతానికి చెందిన ఓం ప్రకాష్ జ్ఞాన్‌చంద్‌తో ప్రేమ సంబంధంలో ఉంది. ఆ మహిళ తన కుటుంబాన్ని విడిచిపెట్టి ఓం ప్రకాష్‌తో కలిసి అతని ఇంట్లో నివసిస్తోంది.
అనంతరం మహిళను తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు పాపహండికి వచ్చారు. కుటుంబ సభ్యులు సదరు మహిళను తీసుకెళ్తున్నప్పుడు జర్నలిస్టులు ఫోటోగ్రాఫ్‌లు, వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఏఎస్పీ జే కృష్ణ బెహరా జర్నలిస్టును కొట్టారు. జర్నలిస్టును కొట్టిన ఏఎస్పీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం జర్నలిస్టులు పాపడహండి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. అయితే జిల్లా అదనపు మెజిస్ట్రేట్ సంఘటనా స్థలానికి చేరుకుని నిరసన తెలుపుతున్న జర్నలిస్టులతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.
బాధిత యువతితో పాటు అడ్డుకోవాడనికి వెళ్లిన మహిళల శరీర భాగాలను తాకుతూ ఏఎస్పీ జయకృష్ణ బెహరా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో నవరంగపూర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠీ గురువారం ఉదయం విలేకర్ల సమావేశం నిర్వహించారు. తక్షణమే ఏఎస్పీని విధుల నుంచి తొలగించి, చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Here's Tweet
బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశం పార్టీ జిలా అధ్యక్షురాలు షర్మిష్టా త్రిపాఠి మాట్లాడుతూ.. మహిళను అగౌరవంగా పరిచిన అధికారిపై చర్యలు తీసుకోకపోతే జిల్లావ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. అనారోగ్యం కారణంతో ఏఎస్పీ జయకృష్ణ గురువారం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేరడం గమనార్హం. బాధిత మహిళను పోలీసులు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఎస్పీ సుశ్రీ సెలవులో ఉండటంతో కొరాపుట్ జిల్లా ఎస్పీ వరుణ్ గుంటువల్లి ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. ప్రత్యేక అధికారిగా ఏఎస్పీ బ్రహ్మ దర్యప్తు ప్రారంభించారు.