Odisha: పూట గడవని కూలీ రూ.2.59 లక్షల ట్యాక్స్ కట్టాలట, నోటీసులు జారీ చేసిన ఐటీ శాఖ, లబోదిబోమంటున్న ఒడిషా రోజు వారి కూలీ, నా యజమానే నన్ను మోసం చేసాడన్న బాధితుడు

సాయంత్రం వరకు పనిచేస్తే తప్ప పూటగడవని పరిస్థితి.అలాంటి వ్యక్తికి ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చాయి. ఏకంగా రూ.2.59 లక్షలు చెల్లించాలంటూ ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ (Income Tax Department) నుంచి నోటీసులు అందాయి. దీంతో షాక్‌ తిన్న కూలీ (daily wage labourer) అంత డబ్బు తానెక్కడి నుంచి కట్టేదంటూ లబోదిబోమంటున్నాడు.

Odisha daily wage labourer gets I-T notice for Rs 1.47 cr transaction(Photo-IANS)

Bhubaneswar, Febuary 4: అతనో రోజు వారి కూలీ, చదువు కూడా తెలియని అమాయకుడు. సాయంత్రం వరకు పనిచేస్తే తప్ప పూటగడవని పరిస్థితి.అలాంటి వ్యక్తికి ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చాయి. ఏకంగా రూ.2.59 లక్షలు చెల్లించాలంటూ ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ (Income Tax Department) నుంచి నోటీసులు అందాయి. దీంతో షాక్‌ తిన్న కూలీ (daily wage labourer) అంత డబ్బు తానెక్కడి నుంచి కట్టేదంటూ లబోదిబోమంటున్నాడు.

పన్ను చెల్లింపుదారులకు ఊరట, తగ్గిన ఆదాయపు పన్ను రేట్లు

వివరాల్లోకెళితే.. దినసరి కూలీకి ఆదాయ పన్ను శాఖ అధికారులు నోటీసులు పంపిన ఉదంతం ఒడిశాలో(Odisha) చోటు చేసుకుంది. నాబారంగ్‌పూర్‌లోని (Nabarangpur district) పుర్జరిభరంది (Purjaribharandi village) గ్రామానికి చెందిన సనధర్‌ గంద్‌ ఓ దినసరి కూలీ. అయితే 2014-15 వార్షిక సంవత్సరంలో బ్యాంకులో రూ.1.74 కోట్ల లావాదేపీలు జరిపినందుకు గానూ ఐటీ శాఖ ఆధికారులు పన్ను నోటీసులు పంపారు.

మహిళా టీచర్‌పై క్రూరమైన దాడి

దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘నాకంతా అయోమయంగా ఉంది. రూ. 2.59 లక్షలు చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు పంపింది. కానీ ఇంత డబ్బు ఎక్కడినుంచి తేవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇది ఎలా జరిగిందా అని అధికారులు ఆరా తీస్తే అసలు విషయాలు బయటకు వచ్చాయి. అదే గ్రామానికి చెందిన ‘పప్పు అగర్వాల్‌ అనే వ్యాపారి ఇంట్లో ఏడు సంవత్సరాలుగా ఇతను పని చేస్తున్నాడు.

ధరలు పెరిగేవి, తగ్గేవి ఏంటో తెలుసా

ఆ సమయంలో నా భూమి పట్టా అడిగితే ఇచ్చాను. నా ఆధార్‌ కార్డు, ఓటర్‌ ఐడీ కార్డు కాపీలు అడిగితే ఇచ్చాను. వాటితో ఆయన ఏం చేశాడో నాకు తెలీదు. ఖాళీ పేపర్‌, భూమి పట్టాలపై నా సంతకం తీసుకుని మోసం చేశాడు’ అంటూ సనధర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే కూలీ గుర్తింపు కార్డుల ఆధారంగా వ్యాపారి బ్యాంకు ఖాతాను తెరిచి, దాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందిస్తూ.. బ్యాంకు ఖాతాను ఎవరు నిర్వహించారన్నది తమకు అనవరసరమని చెబుతున్నారు.