Omicron Spread: డెల్టా వేరియంట్ కంటే మూడు రెట్లు ఎక్కువ ప్రమాదం, ఒమిక్రాన్‌పై రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్ర ఆరోగ్య శాఖ, 100 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

మన దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కాగా డెల్టా వేరియంట్ కంటే మూడు రెట్లు ఎక్కువ (Omicron at least 3 times more transmissible) ఇన్ఫెక్షన్ కలిగించే లక్షణం ఒమిక్రాన్ వేరియంట్ కు (Omicron Spread) ఉంది. యూరప్, అమెరికాలను ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తోంది.

Coronavirus in India (Photo-PTI)

New Delhi, Dec 22: మన దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కాగా డెల్టా వేరియంట్ కంటే మూడు రెట్లు ఎక్కువ (Omicron at least 3 times more transmissible) ఇన్ఫెక్షన్ కలిగించే లక్షణం ఒమిక్రాన్ వేరియంట్ కు (Omicron Spread) ఉంది. యూరప్, అమెరికాలను ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తోంది. మన దగ్గర కూడా కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలు, యూటీలకు జాగ్రత్తగా ఉండాలని లేఖలు రాసింది.

కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తన లేఖలో, ప్రస్తుత శాస్త్రీయ ఆధారాల ఆధారంగా డెల్టా VOC కంటే కొత్త వేరియంట్ ఆఫ్ కన్సర్న్ (VOC) Omicron కనీసం 3 రెట్లు ఎక్కువగా వ్యాపిస్తుంది. "అంతేకాకుండా, డెల్టా VOC ఇప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉంది," అన్నారాయన. అందువల్ల, స్థానిక మరియు జిల్లా స్థాయిలో మరింత ఎక్కువ దూరదృష్టి, డేటా విశ్లేషణ, డైనమిక్ నిర్ణయం తీసుకోవడం, కఠినమైన, సత్వర నియంత్రణ చర్యలు అవసరమని భూషణ్ లేఖలో తెలిపారు. కేంద్రం చేసిన సూచనల్లో కంటైన్మెంట్లు, రాత్రిపూట కర్ఫ్యూలు, టెస్టింగ్, ట్రేసింగ్ తదితర అంశాలు ఉన్నాయి.

తెలంగాణలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదు, 24కి చేరిన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య, దేశంలో రెండవ స్థానంలో...

రాష్ట్రాలకు, యూటీలకు కేంద్ర ఆరోగ్యశాఖ రాసిన లేఖలోని ప్రధానాంశాలు ఇవే:

స్థానిక పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు తీసుకోవాలి.

గత వారం రోజుల్లో 10 శాతానికి మించి పాజిటివ్ కేసులు వచ్చినా, ఆక్సిజన్ సపోర్ట్ ఉన్న ఐసీయూ బెడ్స్ 40 శాతం ఆక్యుపెన్సీ ఉన్నా పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలి. పరిస్థితి ఈ స్థాయికి రాకముందే తగు చర్యలు తీసుకోవాలి. కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలి. తగు ఆంక్షలు విధించాలి. అవసరమైతే రాత్రి పూట కర్ఫ్యూలను విధించాలి.

మన దేశంలోని పలు ప్రాంతాల్లో ఒమిక్రాన్ తో పాటు డెల్టా వేరియంట్ కూడా ఇప్పటికీ ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కంటైన్మెంట్ ప్రక్రియను ముమ్మరం చేయాలి. పరిస్థితి విషమించక ముందే కట్టుదిట్టమైన అన్ని చర్యలను తీసుకోవాలి.

టెస్టింగ్ ముమ్మరం చేయాలి. కరోనా పాజిటివ్ వచ్చిన వారిపై నిఘా ఉంచాలి. వారి కాంటాక్టులను ట్రేస్ చేయాలి. గడప గడపకూ వెళ్లి కేసులను గుర్తించాలి.

ఒక క్లస్టర్ లేదా ఒక సమూహంలో ఇన్ఫెక్షన్లను గుర్తించినప్పుడు వెంటనే వారి శాంపిల్స్ ని జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించాలి.

100 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలి.

వైద్యరంగానికి సంబంధించిన ఆసుపత్రి బెడ్లు, అంబులెన్సులు, ఆక్సిజన్ పరికరాలు, మందులు తదితర మౌలిక వసతులను మెరుగుపరుచుకోవడానికి అత్యవసర నిధులను వినియోగించుకోవాలి.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement