Coronavirus in TS (Photo Credits: IANS)

తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 4 ఒమిక్రాన్ కేసులను (Omicron in TS) గుర్తించారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కి చేరింది. వీటిలో 19 కేసులు (Omicron Variant) నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినట్టు వెల్లడైంది. రాష్ట్రంలో కొన్నిరోజుల వ్యవధిలోనే కొత్త వేరియంట్ కేసులు రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ కేసుల్లో దేశంలో ఢిల్లీ, మహారాష్ట్ర చెరో 54 కేసులతో ప్రథమ స్థానంలో ఉండగా, తెలంగాణ 24 కేసులతో రెండో స్థానంలో ఉంది. దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200 దాటింది.

రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 39,919 కరోనా పరీక్షలు నిర్వహించగా, 172 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 86 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 20 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 188 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు.

దేశంలో తగ్గుతున్న కోవిడ్, పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు, కొత్తగా 6,317 మందికి కరోనా, 318 మంది మృతి, 213కు పెరిగిన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,79,892 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,72,251 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,625 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,016కి పెరిగింది.