Onions Price @ Rs.220: కిలో ఉల్లి ధర రూ. 220, బంగ్లాదేశ్‌లో కోయకుండానే కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి, ధరల పెరుగుదలతో వాడకాన్ని ఆపేసిన బంగ్లా ప్రధాని హసీనా, పలుచోట్ల వినియోగదారులు ఆందోళన
ముఖ్యంగా దక్షిణాసియాలో కొయ్యకుండానే ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. భారత్ లో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ఉల్లి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో సెప్టెంబర్ నెల నుంచి ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేదం విధించింది.
Dhaka,November 19: ఆనియన్ ధరలు (Onion Price HIke) ప్రపంచ దేశాల్ని కలవరానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాసియా(South Asia)లో కొయ్యకుండానే ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. భారత్ (India)లో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ఉల్లి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో సెప్టెంబర్ నెల నుంచి ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేదం విధించింది.
అయితే ఈ నిషేధం ప్రభావం పొరుగుదేశమైన బంగ్లాదేశ్ (Bangladesh)పై ఎక్కువగా పడినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ ఉల్లిని భారత్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. కేంద్రం ఉల్లి ఎగుమతులపై నిషేదం విధించడంతో ఆదేశం మయన్మార్, టర్కీ, చైనాల నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది.
ఉల్లి దిగుమతి చేసుకోవడంతో ఆ దేశంలో ఉల్లి ధర రూ.220 నుంచి రూ.260 (Onions Price@220)కి చేరింది. ఉల్లి ధర పెరగడంతో బంగ్లాదేశ ప్రధాని షేక్ హసీనా (bangladesh prime minister Sheikh Hasina) వాడటం నిలిపివేశారు. ఉల్లి వాడకాన్ని నిలిపివేసినట్లు ఆమె మీడియా సెక్రటరీ తుషార్ వెల్లడించారు.
బంగ్లాదేశ్‌లో ఉల్లి నిరసన
భారత్ నుంచి దిగుమతి ఆగిపోవడంతో బంగ్లాదేశ్‌లో ఉల్లిపాయలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కిలో ఉల్లిపాయల ధర రూ.220కు చేరింది. అనూహ్యంగా అక్కడ ధరలు పెరిగిపోవడంతో పలుచోట్ల వినియోగదారులు ఆందోళనకు దిగారు. దీంతో బంగ్లా ప్రభుత్వం విమానాల ద్వారా టర్కీ, ఈజిప్ట్, చైనా నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటూ ధరలు తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది.
ఉల్లి కోసం జనాల అవస్థలు
మరో రెండు నెలల పాటు ఇవే ధరలు కొనసాగే అవకాశముందని తెలుస్తోంది. ధరల పెరుగులతో వినియోగం తగ్గిందని.. దీంతో తమ వ్యాపారాలు మందగించాయని చిన్న వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
వీకెండ్ షాపింగ్ అంటూ నెటిజన్ సెటైర్
మరోవైపు మనదేశంలోనూ ఉల్లిపాయల ధరలు మండిపోతున్నాయి. మేలు రకం ఉల్లి కిలో 70 రూపాయల వరకు బహిరంగ మార్కెట్ అమ్ముతున్నారు. నెల రోజులుగా ధరలు ఎక్కువగా ఉన్నా పాలకులు పట్టించుకున్నట్టు కనబడటం లేదు.
ఉల్లి పెరుగుదల మీద మరో సైటైర్
వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో ఉల్లిపాయలు ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. మరో రెండు నెలల పాటు ఇవే ధరలు కొనసాగే అవకాశముందని వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉల్లి ధరల గురించి ప్రతిపక్షాలు ప్రస్తావించనున్నాయి.