Voter Turnout In Phase 6: పశ్చిమ బెంగాల్ లో అత్యధికంగా పోలింగ్, ఆరో దశలో మొత్తం 59.12 శాతం పోలింగ్ నమోదు, రేపు తుది పోలింగ్ శాతం వచ్చే అవకాశం
పశ్చిమ బెంగాల్‌లో (West Bengal Polling) అత్యధికంగా 78 శాతం ఓటింగ్ రికార్డైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరిగింది.
New Delhi, May 25: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ఆరో దశలో 59.12 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లో (West Bengal Polling) అత్యధికంగా 78 శాతం ఓటింగ్ రికార్డైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరిగింది. ఎన్నికల సంఘం (EC) ఓటర్ టర్నింగ్ యాప్‌లో అప్‌డేట్ చేసిన గణాంకాల ప్రకారం జార్ఖండ్‌లో 62.66 శాతం, ఒడిశాలో 59.92 శాతం, హర్యానాలో 58.24 శాతం పోలింగ్ నమోదైంది.
కాగా, ఢిల్లీలో శనివారం జరిగిన ఒకే దశ ఓటింగ్‌లో 54.37 శాతం పోలింగ్ నమోదైంది. ఉత్తర ప్రదేశ్‌లో 54.03 శాతం, బీహార్‌లో 53.19 శాతం మేర ఓటింగ్‌తో వెనుకబడ్డాయి. జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ నియోజకవర్గంలో 51 శాతం పోలింగ్ నమోదైంది. 1989లో కశ్మీర్‌లో మిలిటెన్సీ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధిక ఓటింగ్. ఐదో దశ తుది పోలింగ్ శాతం కొంచెం పెరిగే అవకాశమున్నది.