Telangana: వీడియో ఇదిగో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఆందోళన, వారంలో ఒకసారి ఉండే జమ్ము తావి ఎక్స్‌ప్రెస్ రద్దు కావడంపై నిరసన

39 రైళ్లు రద్దు చేయడంతో పాటు 7 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. ఇక 53 రైళ్లను దారి మళ్లించారు.మరో 7 రైళ్లను రీ షెడ్యూల్‌ చేశారు.

Passengers protest at Secunderabad Railway Station due to the cancellation of Jammu Tawi Express which runs once a week

Hyd, Nov 13: పెద్దపల్లి జిల్లాలో గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 39 రైళ్లు రద్దు చేయడంతో పాటు 7 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. ఇక 53 రైళ్లను దారి మళ్లించారు.మరో 7 రైళ్లను రీ షెడ్యూల్‌ చేశారు. వారంలో ఒకసారి ఉండే జమ్ము తావి ఎక్స్‌ప్రెస్ రద్దుకావడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల ఆందోళన వ్యక్తం చేశారు. మరో మూడు రైళ్లు కూడా రద్దు చేయడంతో నిరసనకు దిగారు.

దక్షిణ మధ్య రైల్వే క్యాన్సిల్ చేసిన వివరాలను చూస్తే.. నర్సాపూర్‌-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-నాగ్‌పుర్‌, హైదరాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, సికింద్రాబాద్‌-కాగజ్‌నగర్‌, కాజీపేట-సిర్పూర్‌ టౌన్‌, సిర్పూర్‌ టౌన్‌-కరీంనగర్‌, కరీంనగర్‌-బోధన్‌, సిర్పూర్‌ టౌన్‌-భద్రాచలం రోడ్‌, భద్రాచలం రోడ్‌-బల్లార్షా, బల్లార్షా-కాజీపేట, యశ్వంత్‌పూర్‌-ముజఫర్‌పూర్‌, కాచిగూడ-నాగర్‌సోల్, కాచిగూడ-కరీంనగర్‌, సికింద్రాబాద్‌-రామేశ్వరం, సికింద్రాబాద్‌-తిరుపతి, ఆదిలాబాద్‌-పర్లి, అకోలా-పూర్ణ, ఆదిలాబాద్‌-నాందేడ్‌, నిజామాబాద్‌-కాచిగూడ, గుంతకల్లు-బోధన్‌ రైళ్లను రద్దు చేశారు.

పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, 37 రైళ్ల రద్దు, పలు రైళ్లు దారి మళ్లింపు

పెద్దపల్లి-రామగుండం మధ్య రాఘవాపూర్‌ వద్ద మంగళవారం రాత్రి గూడ్సు రైలు బోల్తాపడింది. ఐరన్‌ కాయిల్స్‌తో వెళ్తున్న రైలు ఓవర్‌లోడ్‌లో 11 వ్యాగన్లు బోల్తా పడ్డాయి. వేగంగా వెళ్తున్న రైలు బోగీల మధ్య ఉన్న లింక్‌లు తెగిపోవడంతోపాటు ఒకదానిపై మరో బోగి పడి మూడు ట్రాక్‌లు దెబ్బతిన్నాయి.

Passengers protest at Secunderabad Railway Station

రాత్రి నుంచి ఘటనాస్థలిలో పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన కారణంగా ఢిల్లీ, చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు.