IPL Auction 2025 Live

PM Modi's Tour: అంఫాన్ సైక్లోన్ కల్లోలం, 83 రోజుల తర్వాత మమతా ఇలాకాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ, స్వాగతం పలికిన వెస్ట్ బెంగాల్ సీఎం, అంఫాన్ ప్రభావంపై ఒడిషా, పశ్చిమ బెంగాల్ సీఎంలతో సమీక్ష సమావేశాలు

తీవ్రంగా ఆస్థి నష్టం కూడా జరిగింది. అంఫాన్‌ తుఫాన్‌ (Cyclone Amphan) నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమబెంగాల్‌ లో (PM Modi's Tour) పర్యటిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ (PM Narendra Modi) ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బెంగాల్‌ కు చేరుకున్నారు. కోల్‌ కతా ఎయిర్‌ పోర్టులో ప్రధాని మోదీకి సీఎం మమతాబెనర్జీ స్వాగతం పలికారు.

PM Modi's West Bengal Tour (Photo-ANI)

New Delhi, May 22: వెస్ట్ బెంగాల్‌‌లో అంఫాన్‌ సృష్టించిన భీభత్సానికి 72 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్రంగా ఆస్థి నష్టం కూడా జరిగింది. అంఫాన్‌ తుఫాన్‌ (Cyclone Amphan) నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమబెంగాల్‌ లో (PM Modi's Tour) పర్యటిస్తున్నారు. దాదాపు 83 రోజుల తర్వాత ఆయన వెస్ట్ బెంగాల్ లో అడుగుపెట్టారు. ప్రధానమంత్రి మోదీ చివరి పర్యటన ఫిబ్రవరి 29 న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్ మరియు చిత్రకూట్లలో జరిగింది. భారత ప్రధాని 83 రోజుల తరువాత ఈ పర్యటనకు వెళుతున్నారు, ఇది దాదాపు 3 నెలలు సమయం తర్వాత టూర్లో భాగంగా పశ్చిమ బెంగాల్ లో అడుగుపెట్టారు.

ఈ మేరకు ప్రధాని మోదీ (PM Narendra Modi) ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బెంగాల్‌ కు చేరుకున్నారు. కోల్‌ కతా ఎయిర్‌ పోర్టులో ప్రధాని మోదీకి సీఎం మమతాబెనర్జీ స్వాగతం పలికారు. అంఫాన్ దెబ్బకు విలవిలలాడిన వెస్ట్ బెంగాల్, దేశం యావత్తు మీకు అండగా నిలుస్తుంది, ట్విట్టర్ ద్వారా తెలిపిన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ బెంగాల్‌తోపాటు ఒడిశాలో ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ, ఒడిశా సీఎం నవీన పట్నాయక్‌ తో ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని వెంట కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ , బాబుల్‌ సుప్రియో, ప్రతాప్‌ చంద్ర సారంగి, దేవశ్రీ చౌదరి ఉన్నారు. విధ్వంసం సృష్టించిన అంఫాన్, వెస్ట్ బెంగాల్,ఒడిషాలో భారీగా ఆస్తి నష్టం, నీటిలో మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలు, వీడియోల్లో విధ్వంసం ఎలా ఉందో మీరే చూడండి

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర తుఫాన్‌గా మారి ఒడిశా (Odisha) , బెంగాల్‌ (West Bengal) తీర ప్రాంతాల నడుమ తీరాన్ని తాకింది. దీంతో ఆ రెండు రాష్ట్రాల్లో బలమైన ఈదురు గాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. పలుచోట్ల చెట్లు నేలకూలాయి. పంటలు ధ్వంసమయ్యాయి. పలు తీర ప్రాంత గ్రామాల్లో నివాసాలు దెబ్బతిన్నాయి. అయితే ఒడిశాతో పోల్చితే పశ్చిమబెంగాల్‌పై తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా పడింది. అంఫాన్‌ తుఫాన్‌ ఆ రాష్ట్రంలో 72 మందిని పొట్టనపెట్టుకుంది.

Here's ANI Video

వెస్ట్ బెంగాల్ లో తుఫాన్ ‌ధాటికి భారీ వృక్షాలు, స్తంభాలు నేలకొరిగాయి. ఇండ్లు ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. నీటి ప్రవాహానికి బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. ముఖ్యంగా రాజధాని కోల్‌కతాలో తుఫాన్‌ బీభత్సాన్ని సృష్టించింది. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

వెయ్యికి పైగా కమ్యూనికేషన్‌ టవర్లు దెబ్బతిన్నాయి. దీంతో మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. కోల్‌కతా విమానాశ్రయంలో నిలిపి ఉంచిన పలు విమానాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. గత వందేండ్లలో రాష్ట్రంపై ఇంతటి భయానక తుఫాన్‌ విరుచుకుపడటం చూడలేదని వాతావరణ నిపుణులు తెలిపారు. ‘అంఫాన్‌' కారణంగా ఒడిశాలో ఇద్దరు మృతి చెందారు. 44.8 లక్షల మంది ప్రభావితమయ్యారు. బంగ్లాదేశ్‌లో పది మంది మరణించారు.

కరోనా వైరస్‌ కంటే ‘అంఫాన్‌' ప్రభావం మరింత ఎక్కువగా ఉన్నదని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. తుఫాన్‌ వల్ల రాష్ట్రంలో 72 మంది మరణించినట్టు వెల్లడించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షల వరకు పరిహారం అందించనున్నట్టు ప్రకటించారు. తన జీవిత కాలంలో ఇలాంటి తుఫాన్‌ను ఎప్పుడూ చూడలేదన్నారు. తుఫాన్‌ ప్రభావిత జిల్లాల్లో ప్రధాని మోదీ పర్యటించి అన్ని విధాలుగా రాష్ర్టాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.