PM Narendra Modi (Photo Credits: PTI)

New Delhi, May 21: తీవ్ర ఉగ్రరూపం దాల్చిన పెను తపాన్‌ ‘అంఫాన్‌’ పశ్చిమ బెంగాల్,‌ ఒడిశా రాష్ట్రాల్లో బీభత్సం (Cyclone Amphan Impact) సృష్టిస్తోంది. తుపాన్‌ దాటికి అనేక ఇళ్లు నేలకొరిగాయి. భారీ వర్షాలు, తీవ్రమైన గాలుల కారణంగా సమాచార వ్యవస్థ, విద్యుత్‌ సరాఫరా నిలిచిపోయింది. ఈ తుపాన్‌ (Cyclone Amphan) తీవ్రంగా మారటంతో పశ్చిమబెంగాల్‌లో 72 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో పెను తుపాన్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi ) స్పందించారు. అంఫాన్‌ తుఫాను వల్ల తీవ్రంగా ప్రభావితమైన పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి దేశం యావత్తు అండగా నిలుస్తుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. విధ్వంసం సృష్టించిన అంఫాన్, వెస్ట్ బెంగాల్,ఒడిషాలో భారీగా ఆస్తి నష్టం, నీటిలో మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలు, వీడియోల్లో విధ్వంసం ఎలా ఉందో మీరే చూడండి

బెంగాల్‌లో తుఫాను సృష్టించిన విధ్వంసానికి సంబంధించి మీడియాలో ప్రసారమవుతున్న వీడియోలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయని ప్రధాని ట్వీట్‌ చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్రం అన్ని విధాలుగా బెంగాల్‌కు సహకరిస్తుందని, బెంగాల్‌ ప్రజల క్షేమం కోసం దేశం ప్రార్థిస్తున్నదని మోదీ (PM Narendra Modi Prays) ట్విట్టర్లో పేర్కొన్నారు. తుఫాను ద్వారా నష్టపోయిన బాధితులకు సహాయం అందించడంలో ఏ విధంగానూ వెనుకాడమని స్పష్టం చేశారు.

Here's the tweet:

పశ్చిమబెంగాల్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు చేపట్టాల్సిన అన్ని చర్యలు కొనసాగుతున్నాయని ప్రధాని తెలిపారు. తుఫాను తీరాన్ని తాకడానికి ముందే నేషనల్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ ఫోర్స్‌ (NDRF)బెంగాల్‌కు చేరుకుని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో NDRF బలగాల రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతున్నదని, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని ప్రధాని ట్వట్టిర్‌లో పేర్కొన్నారు

Here's Cyclone Amphan Impact

ఈ కష్ట సమయంలో దేశమంతా పశ్చిమబెంగాల్‌కు అండగా ఉంటుంది. అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాం. పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి’. అని ప్రధాని ట్వీట్‌ చేశారు. మరో ట్వీట్‌లో.. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ విపత్తు సహాయక బృందాలు పనిచేస్తున్నాయని ప్రధాని అన్నారు. స్థానికంగా పరిస్థితిని ఉన్నతాధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తున్నామని ప్రధాని తెలిపారు.

Here's Cyclone Amphan Impact

బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. రాష్ట్రంలోఅంఫాన్‌ తుపాన్‌ ప్రభావం కరోనా వైరస్‌ కంటే తీవ్రంగా ఉందని తెలిపారు. అదేవిధంగా ఈ తుపాన్‌ను ఘోర విపత్తుగా ఆమె పేర్కొన్నారు. తుపాన్‌ తీవ్రతను ఆమె కంట్రోల్‌ రూం ద్వారా బుధవారం పర్యవేక్షించారు. తుపాన్‌ భారీ వర్షం, తీవ్రమైన గాలితో విలయతాండవం సృష్టించిందని ఆమె చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి తీవ్ర తుపాన్‌ సంభవించిందని ఆమె అన్నారు. ‘నేను వార్‌ రూమ్‌లో కూర్చు న్న సమయంలో నా కార్యాలయంపై తుపాన్‌ ప్రభావం తీవ్రంగా పడింది’ అని సీఎం మమాతా బెనర్జీ తెలిపారు.

Here's DG NDRF ѕαtчα prαdhαn Tweet

Here's CM Naveen Patnaik Tweet

ఆంఫన్ తుపాను తాకిడికి పశ్చిమబెంగాల్‌లో 72 మంది చనిపోయారు. తన జీవితంలో ఇంతటి విధ్వంసాన్ని చూడలేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. పరిస్థితిని స్వయంగా అంచనా వేసేందుకు ప్రధానమంత్రిని రాష్ట్రంలో పర్యటించాలని కోరారు. మృతుల కుటుంబాలకు ఆమె రెండున్నర లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.

Here's Impact on Kolkata Airport

ఈ తుపాన్‌ వల్ల సముద్ర తీర ప్రాంత ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. పలు ఇళ్లు కూలిపోయి, చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్థంబాలు పడిపోవటంతో కరెంట్‌ నిలిచిపోయింది. కొన్ని లోతట్టు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. తుపాన్‌ వల్ల 125 కిలో మీటర్ల వేగంతో గాలి వీచటంతో ప్రజలు భయభ్రాతులకు గురయ్యారు. ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో తుపాన్‌ ప్రభావంతో మొబైల్‌, ఇంటర్‌నెట్‌ సేవలు నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ కారణంగా మూసివేసిన కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో వర్షపు వరద నీరు చేరింది. ఇక బెంగాల్‌లోని దీఘా బంగ్లాదేశ్‌లోని హతియా ద్వీపం మధ్య బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో అతి తీవ్ర తుపానుగా ఉంపన్‌ తీరం దాటిన విషయం తెలిసిందే

బెంగాల్‌లో పెద్ద ఎత్తున మరణాలు సంభవించడంపై బీజేపీ విచారం వ్యక్తం చేసింది. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఒడిశాలోనూ ఆంఫన్ తీవ్ర ప్రభావం చూపింది. ఒడిశాలో ఇద్దరు చనిపోయారని సమాచారం. పశ్చిమబెంగాల్, ఒడిశాలో ఒకటి రెండు రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఎన్డీఆర్‌ఎఫ్ చీఫ్ ఎస్ ఎన్ ప్రధాన్ తెలిపారు.