PM Modi Releases Rs 75 Coin: రూ.75 స్మారక నాణాన్ని విడుదల చేసిన ప్రధాని మోదీ, ఎఫ్ఏఓ 75 వ వార్షికోత్సవం సందర్భంగా విడుదల, నేడు ప్రపంచ ఆహార దినోత్సవం
కాగా ఎఫ్ఏవో తో భారతదేశానికి ఉన్న దశాబ్దాల సంబంధాన్ని గుర్తుచేస్తూ ఈ స్మారక నాణాన్ని (commemorative Coin) శుక్రవారం విడుదల చేశారు.
New Delhi, Oct 16: ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ) 75 వ వార్షికోత్సవం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 రూపాయల స్మారక నాణాన్ని విడుదల (PM Modi Releases Rs 75 Coin) చేశారు. కాగా ఎఫ్ఏవో తో భారతదేశానికి ఉన్న దశాబ్దాల సంబంధాన్ని గుర్తుచేస్తూ ఈ స్మారక నాణాన్ని (commemorative Coin) శుక్రవారం విడుదల చేశారు. అయితే ప్రత్యేకమైన ఈ కాయిన్ ప్రజలకు అందుబాటులో ఉండదు. ఎఫ్ఏఓ , ‘సాహీ పోషన్ దేశ్ రోషన్’ అనే పదాలు హిందీలో నాణెంపై ఉంటాయి. కాగా నేడు ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఇటీవల అభివృద్ధి చేసిన 17 రకాల బయోఫోర్టిఫైడ్ పంటలను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గెల్చుకోవడం గొప్ప విషయని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆహార సరఫరా విషయంలో భారత పాత్ర, భాగస్వామ్యం చరిత్రాత్మకమైందన్నారు. బలహీన వర్గ ప్రజలను , ఆర్థికంగా, పౌష్టికంగా బలంగా మార్చడంలో ఎఫ్ఏఓ ప్రయాణం అసమానమైనదన్నారు.
Here's Tweet
2016 లో అంతర్జాతీయ పప్పుధాన్యాలు సంవత్సరంగా ప్రకటించిన సంస్థ, 2023 ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్‌గా ప్రకటించిందని, దీనికి భారత మద్దతు పూర్తిగా ఉంటుందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇదిలా ఉంటే భారత్, యూఎన్ ఏజెన్సీ మధ్య దీర్ఘకాల సంబంధాలకు సంకేతంగా ఈ కాయిన్ మిగిలిపోనుంది.
Here's PM Modi Tweet
దీంతో పాటు ప్రధాని మోదీ సోమవారం రోజు కూడా ఒక నాణేన్ని తీసుకువచ్చారు.100 కాయిన్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించారు. రాజమాత విజయ రాజే స్కిందియా జయంతి కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కాయిన్‌ను లాంచ్ చేశారు. మళ్లీ ఇప్పుడు మరో కొత్త కాయిన్ రూ.75ను తీసుకువచ్చారు.
ఈ కాయిన్స్‌ను స్మారక నాణేలుగా చెప్పుకోవచ్చు. వీటిని పౌరులు కావాలనుకుంటే పొందవచ్చు. భారతదేశంలో స్మారక నాణేలు సాధారణంగా కొన్ని ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకొని జారీ చేస్తారు. కొన్నిసార్లు కొంతమంది ప్రసిద్ధ వ్యక్తులు గౌరవార్ధం కూడా వారి చిహ్నంగా కొన్ని నాణేలను తీసుకువస్తుంటారు. అప్పుడు పొందే వీలు ఉంటుంది.