Russia-Ukraine Conflict: భారతీయ విద్యార్థిపై కాల్పులు, ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం, ఉక్రెయిన్ యుద్ధం అంశంపై మోదీ నిర్వహించిన ఎనిమిదో సమావేశమిది
ఈ అంశంపై మోదీ నిర్వహించిన ఎనిమిదో సమావేశమిది.
New Delhi, March 4: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు పాల్పడుతోంది. నేటితో 9వ రోజుకు చేరుకున్నరష్యా సైనిక దాడులు (Russia-Ukraine Conflict) శుక్రవారం పీక్ స్జేజ్‌కు చేరుకున్నాయి. తొమ్మిదొవ రోజు రష్యా బలగాలు యూరప్‌లోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ అయిన జాపోరిజ్జియా న్యూక్లియర్‌ప్లాంట్‌ను టార్గెట్ చేసి రాకెట్ దాడులు జరిపాయి.
ఈ భీకర యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమం పురోగతిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశంలో (PM Narendra Modi Chairs Meet ) సమీక్షించారు. ఈ అంశంపై మోదీ నిర్వహించిన ఎనిమిదో సమావేశమిది. కీవ్ నగరంలో ఓ భారతీయ విద్యార్థిపై కాల్పులు జరిగిన నేపథ్యంలో ఈ సమావేశం (Review Ukraine Crisis Amid Ongoing Exercise) జరిగింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మోదీ వరుసగా ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీలతో మోదీ ఫోన్‌లో మాట్లాడారు.
కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, కీవ్ నగరంలో ఓ భారతీయ విద్యార్థిపై కాల్పులు జరిగాయని, ఆయనను ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స చేయిస్తున్నారని తెలుస్తోంది. గురువారం రాత్రి భారత వాయు సేనకు చెందిన మూడు సీ-17 విమానాల్లో 630 మంది హిందోన్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు. రొమేనియా, హంగరీల నుంచి ఈ విమానాలు వచ్చాయి. ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి భారత దేశానికి చేరుకున్నవారి సంఖ్య 9,000కు చేరుకున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్, సుమీ నగరాల్లో చిక్కుబడి పోయిన భారతీయులు సహా విదేశీ విద్యార్థులను తమ దేశంలోని బెల్గోరోడ్ రీజియన్‌కు సురక్షితంగా తీసుకువచ్చేందుకు 130 బస్సులను పంపను న్నట్లు రష్యా సైనిక ఉన్నతాధికారి ఒకరు గురువారం తెలిపారు. ఉక్రెయిన్‌లోని సంక్షోభ ప్రాంతాల్లో చిక్కుబడిపోయిన భారతీయులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు తగు ఏర్పాట్లు చేయాలంటూ భారత ప్రధాని మోదీ బుధవారం అధ్యక్షుడు పుతిన్‌ను కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా సైనికాధికారి కల్నల్–జనరల్ మిఖాయిల్ మిజిన్‌ట్సెవ్ తెలిపారు.