PM Modi to Address Nation: ప్రధాని మోదీ ప్రసంగం దాని మీదనేనా? సాయంత్రం ఆరు గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని, దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా
భారత పౌరులతో ఓ సందేశం పంచుకోనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. ‘‘ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నాను. దయచేసి మీరంతా ఇందుకు సిద్ధంగా ఉండగలరు’’అని విజ్ఞప్తి చేశారు.
New Delhi, October 20: ప్రధాని నరేంద్ర మోదీ నేడు సాయంత్రం ఆరుగంటలకు జాతిని ఉద్దేశించి (PM Modi to Address Nation) ప్రసంగించనున్నారు. భారత పౌరులతో ఓ సందేశం పంచుకోనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. ‘‘ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నాను. దయచేసి మీరంతా ఇందుకు సిద్ధంగా ఉండగలరు’’అని విజ్ఞప్తి చేశారు. అయితే ఏ అంశం గురించి మాట్లాడాతానన్న దానిపై స్పష్టత లేదు. కాగా దేశంలో రోజురోజుకీ కరోనా (coronavirus cases) మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో, దసరా సహా ఇతర పండుగలు ( Durga Puja 2020) సమీపిస్తున్న వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రధాని మోదీ సూచనలు చేసే అవకాశం ఉంది.
ఇక కోవిడ్-19 వ్యాప్తి, మార్చి 24నాటి జనతా కర్ఫ్యూ మొదలు, వివిధ దశల్లోని అన్‌లాక్ ప్రక్రియ నేపథ్యంలో ప్రధాని ఇప్పటిదాకా ఆరుసార్లు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, గడిచిన 24 గంటల్లో భారత్‌లో 46,791 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 75,97,064కు చేరుకుంది. కరోనా సోకిన వారిలో మంగళవారం నాటికి 587 మంది మృతి చెందడంతో, కోవిడ్ మరణాల సంఖ్య 1,15,197 కు చేరింది.
Here's PM Tweet
గత మూడు నెలల నుంచి తొలిసారి ఇవాళ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేల లోపు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ ఇవాళ ఉదయం తన ట్వీట్‌లో ఈ విషయాన్ని చెప్పింది. కరోనా వైరస్ సమయంలో ఇప్పటికే ఆరుసార్లు మోదీ దేశ ప్రజలకు సందేశం వినిపించారు. ఈసారి ఇది ఏడవది కానున్నది. 19 మార్చి, 24 మార్చి, 3 ఏప్రిల్, 14 ఏప్రిల్, 12 మే, 30 జూన్ తేదీల్లోనూ మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
ఇదిలా ఉంటే ఆరోగ్యం-అభివృద్ధి రంగాల్లో ఎదురయ్యే సవాళ్లపై ప్రపంచంలోని విధాన రూపకర్తలు, శాస్త్రవేత్తలు, సృజనాత్మక ప్రముఖులు పాల్గొనే ‘గ్రాండ్ ఛాలెంజెస్ వార్షిక సమావేశం’లో ఆయన ప్రధానోపన్యాసాన్ని వీడియో లింక్ ద్వారా చేశారు. ఈ ఉపన్యాసంలో ప్రజా భాగస్వామ్యం, ప్రజలే స్వచ్ఛందంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల భారత్‌లో కొవిడ్ మరణాల రేటు తక్కువగా ఉందని ప్రధాని మోదీ చెప్పారు. ‘ప్రపంచవ్యాప్తంగా కేసులు తక్కువగా ఉన్నప్పుడే మేం లాక్‌డౌన్ ప్రకటించాం. మాస్కులు ధరించండని పదేపదే చెప్పి ప్రోత్సహించిన తొలి దేశం మాదే. సామాజిక దూరం పాటించడం తప్పనిసరి చేసిన దేశమూ మాదే. కంటైన్మెంట్ జోన్లు పెట్టిందీ మేమే. ఇంత విశాల, వైవిధ్య భరిత దేశం కొవిడ్‌ను ఎలా తట్టుకుంటుందని ప్రపంచమంతా ఆసక్తిగా చూసింది. ఇదిగో ఈ చర్యల వల్ల రోజువారీ కేసుల సంఖ్య, కేసుల పెరుగుదల రేటు తగ్గుముఖం పట్టింది.
పండగ వేళ కరోనా పరేషాన్, జాగ్రత్తలు తీసుకోకుంటే కేసులు విపరీతంగా పెరుగుతాయని తెలిపిన కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు కమిటీ
ప్రపంచంలోనే రికవరీ రేటు అత్యధికంగా అంటే 88 శాతం ఉన్న దేశం భారతే’’ అని మోదీ అన్నారు. ‘ఇపుడు వ్యాక్సిన్ సరఫరాకు కూడా విస్తృత ఏర్పాట్లు చేశాం. మా శాస్త్రవేత్తలు కొద్ది నెలలుగా కొవిడ్‌పై జరుపుతున్న పోరాటం, వ్యాక్సిన్ సరఫరాకు చేస్తున్న కృషి ఎన్నదగినది. ప్రపంచం మొత్తానికి చౌకధరకు వ్యాక్సిన్ అం దించాలన్న సంకల్పంతో ఉన్నాం’ అని ఆయన చెప్పారు. శాస్త్ర, సృజనాత్మక రంగాల్లో భారీపెట్టుబడి పెట్టే సమాజాలు, దేశాలే భవితను నిర్దేశిస్తాయన్నారు.