IPL Auction 2025 Live

PM-SYM Scheme: కేంద్రం నుంచి నెలకు రూ.3 వేలు పెన్సన్, ప్రధానమంత్రి మంధన్ యోజన పథకం గురించి ఎవరికైనా తెలుసా, PM-SYM స్కీం పూర్తి వివరాలు ఇవే..

ఈ పథకం ద్వారా దేశంలోని అసంఘటిత కార్మికులు నెలకు మూడు వేలు పెన్సన్ అందుకోవచ్చు.

INR currency (Photo Credits: Pixabay)

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమ యోగి మన్‌ధన్ యోజన అనే పథకాన్ని (Pradhan Mantri Shram Yogi Maandhan Yojana) ప్రవేశపెట్టిన సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ పథకం ద్వారా దేశంలోని అసంఘటిత కార్మికులు నెలకు మూడు వేలు పెన్సన్ అందుకోవచ్చు.

వృద్ధాప్యంలో ఉన్న కార్మికులకు ఈ పథకం కింద నెలకు రూ.3,000 పెన్షన్ ఈ పథకం (PMSYM scheme) అందిస్తోంది. అయితే వారికి రూ.15,000 లోపు నెలవారీ ఆదాయం ఉండాలి. అసంఘటిత రంగంలోని కార్మికులైన టైలర్లు, చెప్పులు కుట్టేవాళ్లు, రిక్షా పుల్లర్లు , ఇంటి కార్మికులకు ఈ పథకం ద్వారా 60 ఏళ్ల వరకు రూ. 3 వేలు పెన్సన్ పొందవచ్చు.

ఈ పథకానికి అర్హతలు

దరఖాస్తుదారుడి వయస్సు 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. తప్పనిసరిగా ఆధార్ కార్డ్ , బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి. అలాగే ఆదాయపు పన్ను చెల్లించే వారు EPFO, NPS, NSIC సబ్‌స్క్రైబర్లు ఈ పథకానికి అర్హులు కారు. ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి మీ వయస్సు 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.నెలవారీ ఆదాయం రూ. 15,000 కంటే తక్కువ ఉండాలి.

Here's Ministry of Labour Tweets

కార్మికుల ఈ పెన్సన్ పొందాలంటే ప్రతి నెలా రూ.55 నుండి రూ. 200 వరకు డిపాజిట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో 50 శాతం లబ్ధిదారుడు, 50 శాతం ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది. ఒక వేళ పింఛనుదారుడు మరణిస్తే అతని భార్య లేదా భర్త పెన్షన్ మొత్తాన్ని పొందుతారు.60 ఏళ్ళ వరకు ప్రతి పెన్షనర్ సంవత్సరానికి రూ.36,000 పెన్షన్ పొందుతారు.

ఏప్రిల్ 1 నుంచి ఈ కార్ల అమ్మకాలు బంద్.. కారణం ఏంటి? ఇంతకీ.. ఏయే కార్లు బంద్ కానున్నాయి?

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో రెండు రకాలుగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మన్‌ధన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫాం నింపిన తరువాత రిజిస్టర్డ్‌మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటిపీని ఎంటర్‌ చేస్తే చాలు. ఇక ఆఫ్‌లైన్‌ ద్వారా అయితే కామన్ సర్వీస్ సెంటర్‌లో వివరాలను అందించి దరఖాస్తు చేసుకోవచ్చు