Pranab Mukherjee’s Health: చికిత్సకు స్పందిస్తున్న ప్రణబ్‌ముఖర్జీ అవయువాలు, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపిన ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి, వెంటిలేటర్ సాయంతో చికిత్స
ఆయన శరీరంలోని కీలక అవయవాలు చికిత్సకు స్పందిస్తున్నాయని, ఆరోగ్య పరిస్థితి స్వల్పంగా మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
New Delhi, August 20: ఓ వైపు కరోనా..మరోవైపు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ(84) ఆరోగ్య పరిస్థితి (Pranab Mukherjee’s Health) నిలకడగా ఉందని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి తెలిపింది. ఆయన శరీరంలోని కీలక అవయవాలు చికిత్సకు స్పందిస్తున్నాయని, ఆరోగ్య పరిస్థితి స్వల్పంగా మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రణబ్ ఆరోగ్యానికి సంబంధించిన కీలక సూచీలను స్పెషలిస్టుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్టు ఆర్మీ రిసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు 10న ప్రణబ్‌కు శస్త్రచికిత్స (Brain surgery) చేశారు. చికిత్స తర్వాత నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్–19 పాజిటివ్‌గా (Coronavirus) నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందుతోంది.
Update by ANI
ప్రణబ్ ముఖర్జీ చనిపోయారని సోషల్ మీడియాలో తప్పడు ప్రచారం చేస్తున్నారని.. అది అబద్ధమని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ సీరియస్ అయిన సంగతి విదితమే. తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ చనిపోలేదని.. ఆయన ప్రస్తుతం వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారని అభిజిత్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. సోషల్ మీడియాలో ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయోద్దని ఆయన కోరారు. ప్రణబ్ కూతురు షర్మిష్టా ముఖర్జీ కూడా ఈ తప్పుడు ప్రచారంపై స్పందించారు. తన తండ్రి ప్రణబ్ చనిపోలేదని.. ఆయన బతికే ఉన్నారని ఆమె తెలిపింది.