Vajpayee Birth Anniversary: వాజ్‌పేయికి ఘన నివాళులు అర్పించిన ప్రముఖులు, ఆయన సేవలను స్మరించుకున్న రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు

మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి 97వ జయంతి(Former PM Atal Bihari Vajpayee's birth anniversary) సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని ఆయన స్మృతివనం వద్ద రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్(President Ram Nath Kovind), ప్రధాని నరేంద్రమోడీతొ పాటూ పలువురు నివాళులు అర్పించారు

New Delhi December 25: మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి 97వ జయంతి(Former PM Atal Bihari Vajpayee's birth anniversary) సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని ఆయన స్మృతివనం వద్ద రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్(President Ram Nath Kovind), ప్రధాని నరేంద్రమోడీ(Prime Minister Narendra Modi), లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(Om Birla), రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్(Rajnath Singh), కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah), కేంద్రమంత్రి పియూష్ గోయల్ తో పాటూ పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.

అటల్ బిహారి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రముఖులు ఆయన సేవలను స్మరించుకున్నారు. ట్విట్టర్‌లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, పలువురు కేంద్రమంత్రులు అటల్‌ జీ సేవలను గుర్తు చేసుకున్నారు. వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రతీ ఏటా గుడ్ గవర్నెన్స్ డే(Good Goverence Day) గా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. పరిపాలనలో ఆయన సంస్కరణలకు గుర్తుగా ప్రతీ ఏడాది డిసెంబర్ 25ను సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now