Priyanka Gandhi: ఆరంభం అదుర్స్‌..రాహుల్ గాంధీ రికార్డు బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ, వయనాడ్‌లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపు..కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

వయనాడ్ ఎంపీ స్ధానానికి జరిగిన ఉప ఎన్నికల్లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొంది ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు ప్రియాంక. దాదాపు 4,08,036 ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి సత్యన్ మొకేరిపై విజయం సాధించారు ప్రియాంక. ప్రతి రౌండ్‌లోనూ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చారు.

Priyanka Gandhi breaks Rahul Gandhi record at Wayanad by elections(X)

Hyd, Nov 23: ప్రియాంక గాంధీ...రికార్డు తిరగరాశారు. వయనాడ్ ఎంపీ స్ధానానికి జరిగిన ఉప ఎన్నికల్లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొంది ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు ప్రియాంక. దాదాపు 4,08,036 ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి సత్యన్ మొకేరిపై విజయం సాధించారు ప్రియాంక. ప్రతి రౌండ్‌లోనూ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుండి పోటీ చేసిన రాహుల్‌ గాంధీ ...3,64,653 ఓట్ల ఆధిక్యం పొందారు. రాహుల్‌కు మొత్తం 6,47,445 ఓట్లు పోలయ్యాయి. సీపీఐ అభ్యర్థి అన్నీ రాజాకు 2,83,023 ఓట్లు పోలవగా.. బీజేపీ అభ్యర్థి కె.సురేంద్రన్‌కు 1,41,045 ఓట్లు మాత్రమే వచ్చాయి.

రాహుల్ గాంధీ సాధించిన 3.65 లక్షల ఓట్ల రికార్డును బద్దలు కొట్టిన ప్రియాంక గాంధీ 4 లక్షల ఓట్ల ఆధిక్యం సాధించింది. వాయనాడ్ ఉపఎన్నికలో దాదాపు 65 శాతం ఓటింగ్ నమోదుకాగా ఇది సాధారణ ఎన్నికల్లో జరిగిన పోలింగ్ శాతం కంటే తక్కువే. అయినా 4 లక్షలకుపైగా మెజార్టీని సాధించారు ప్రియాంక.  వయనాడ్‌ లో 46 వేల ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ.. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య పోటీ హోరాహోరీ 

తన సతీమణి విజయంపై ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా స్పందించారు. ప్రియాంక కృషిని గుర్తించిన వయనాడ్‌ ప్రజలకు ధన్యవాదాలు. ఆమె కచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తారని తెలుసు. ప్రజల సస్యలను పార్లమెంట్‌లో వినిపించేందుకు ప్రియాంక శ్రమిస్తారు అన్నారు. ప్రస్తుతం పుస్తకాలు చదవడం.. పిల్లలను చూసుకోవడంలో బిజీగా ఉన్న ప్రియాంక ఇప్పుడు దేశ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఈ ఎన్నికల్లో పోటీ చేశారు అని వెల్లడించారు వాద్రా.ఓట్ల లెక్కింపు ఫలితాల్లో బ్యాలెట్‌ ఓట్లు మొదలుకుని ఆఖరి రౌండ్‌ వరకు తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించి విజయాన్ని నమోదు చేశారు ప్రియాంక. సీపీఎం అభ్యర్థి రెండో స్థానంలో ఉండగా బీజేపీ అసలు పోటీలోనే లేదు.



సంబంధిత వార్తలు

Priyanka Gandhi: మీ కోసం పోరాడుతా..తనపై నమ్మకం ఉంచి రికార్డు మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రియాంక గాంధీ..ప్రజల వ్యక్తిగా పనిచేస్తానని వెల్లడి

Priyanka Gandhi: ఆరంభం అదుర్స్‌..రాహుల్ గాంధీ రికార్డు బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ, వయనాడ్‌లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపు..కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవిపై ఫిటింగ్ పెట్టిన ఏక్‌నాథ్ షిండే...సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని కామెంట్, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని వెల్లడి

Priyanka Gandhi Vadra Leading in Wayanad: వయనాడ్‌ లో 46 వేల ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ.. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య పోటీ హోరాహోరీ