Punjab Shocker: చిన్న పిల్లాడిపై 40 ఏళ్ళ కామాంధుడు లైంగిక దాడి, చీకటి ప్రదేశంలోకి తీసుకువెళ్లి అత్యాచారం, ఆపై చిన్నారిని చంపేందుకు ప్రయత్నం

పంజాబ్‌లో దారుణ ఘటన జ‌రిగింది. బ‌ర్నాలాలో మైన‌ర్ బాలుడిపై శుక్ర‌వారం 40 ఏండ్ల వ్య‌క్తి లైంగిక దాడికి పాల్ప‌డి హ‌త్యా య‌త్నం (40-year-old man rapes minor) చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. చిన్నారి(8)ని వైద్య పరీక్ష‌ల నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించిన పోలీసులు నిందితుడిపై పోక్సో స‌హా ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు.

Image used for representational purpose | (Photo Credits: File Image)

Punjab, April 30: పంజాబ్‌లో దారుణ ఘటన జ‌రిగింది. బ‌ర్నాలాలో మైన‌ర్ బాలుడిపై శుక్ర‌వారం 40 ఏండ్ల వ్య‌క్తి లైంగిక దాడికి పాల్ప‌డి హ‌త్యా య‌త్నం (40-year-old man rapes minor) చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. చిన్నారి(8)ని వైద్య పరీక్ష‌ల నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించిన పోలీసులు నిందితుడిపై పోక్సో స‌హా ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. ఇంటి స‌మీపంలోని ప్లేగ్రౌండ్‌లో చిన్నారి (minor child in Barnala) ఆడుకుంటుండ‌గా అత‌డిని నిర్జ‌న ప్ర‌దేశంలోకి తీసుకువెళ్లిన నిందితుడు లైంగిక వేధించి ఆపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. చిన్నారిని చంపేందుకు ప్ర‌య‌త్నించాడు. ర‌క్త‌పు మ‌ర‌కలున్న దుస్తుల‌ను బాధితుడి కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు అప్ప‌గించారు. ప‌రారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇక హైదరాబాద్ లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి ఓ మైనర్‌ బాలికను మోసం చేసి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన తుకారాంగేట్‌ పోలీస్ స్టేష‌న్‌ పరిధిలో చోటు చేసుకుంది. అడ్డగుట్ట లోహియనగర్‌ ప్రాంతానికి చెందిన యువకుడు బురాన్ (21) కూరగాయాలు విక్రయిస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్‌ బాలిక (16) తో పరిచయం ఏర్పరచుకున్నాడు. తనను ప్రేమిస్తున్నానని చెప్పి ఈ ఏడాది జనవరి 25న ఇంటికి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం రెండు వారాల తర్వాత మళ్లీ ఆమెను ఇంటికి రమ్మని చెప్పి మరోసారి లైంగికంగా అనుభవించాడు.

కట్నం ఇవ్వలేదని.. భార్యను బంధువులతో రేప్ చేయించిన కసాయి భర్త, దాన్ని వీడియో తీసి...ఆ వీడియో ద్వారా డబ్బులు సంపాదిస్తానని బెదిరింపులు

కాగా మూడు నెలలుగా బాలిక ఆరోగ్య పరిస్థితుల్లో తేడాను గమనించిన తల్లి అనుమానం వచ్చి ఈ నెల 23న ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించింది. దీంతో బాలిక మూడు నెలల గర్భవత‌ని అని నిర్థారించారు. బాలికను గట్టిగా మందలించడంతో అసలు విషయం చెప్పింది. కాగా గురువారంసాయంత్రం బాధితురాలి తల్లి తుకారాంగేట్‌ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు బురాన్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement