CM Bhagwant Mann Wedding: రెండవ పెళ్లికి సిద్ధమైన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, డాక్టర్ గురుప్రీత్ కౌర్ అనే యువతితో రేపు వెడ్డింగ్
డాక్టర్ గురుప్రీత్ కౌర్ అనే యువతితో ఆయన వివాహం గురువారం ఛండీగడ్‌లో .. అతి తక్కువ మంది సభ్యుల మధ్య జరగనుందని తెలుస్తోంది. వధువు ఫ్యామిలీ ఫ్రెండ్ అని, చాలా ఏళ్ల నుంచి వీళ్లద్దరికీ పరిచయం ఉందని తెలుస్తోంది
పంజాబ్ సీఎం భగవంత్ మాన్(49) రెండవసారి పెళ్లి పీటలు ఎక్కనున్నారు. డాక్టర్ గురుప్రీత్ కౌర్ అనే యువతితో ఆయన వివాహం గురువారం ఛండీగడ్‌లో .. అతి తక్కువ మంది సభ్యుల మధ్య జరగనుందని తెలుస్తోంది. వధువు ఫ్యామిలీ ఫ్రెండ్ అని, చాలా ఏళ్ల నుంచి వీళ్లద్దరికీ పరిచయం ఉందని తెలుస్తోంది. కాగా, ఆయనకిది రెండో వివాహం. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ఆప్ నేతలు, పంజాబ్ రాజకీయ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. సీఎం భగవంత్ మాన్‌కి ఇది రెండో వివాహం. ఆరేళ్ల కిందట ఆయన విడాకులు తీసుకున్నారు. ఇంద్రప్రీత్ కౌర్‌ను మొదటి వివాహం చేసుకుని.. వ్యక్తిగత కారణాలతో 2015లో విడాకులు ఇచ్చారు. ఈ జంటకు ఒక పాప, బాబు ఉన్నారు.