PNB & Fedaral Bank Fined: రెండు బ్యాంకులకు భారీ షాక్ ఇచ్చిన ఆర్బీఐ, నిబందనలు ఉల్లంఘించినందుకు జరిమానా
కేవైసీ నిబంధనల అమలును ఫెడరల్ బ్యాంక్ ఉల్లంఘించింది. మెర్సిడెజ్-బెంజ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇండియా సైతం కేవైసీ, ఎన్బీఎఫ్సీ నిబంధనలను కొసమట్టం ఫైనాన్స్ లిమిటెడ్ ఉల్లంఘించాయి.
Mumbai, NOV 03: నిబంధనలు ఉల్లంఘించిన రెండు బ్యాంకులు, రెండు ఫైనాన్స్ సంస్థలపై కేంద్రీయ బ్యాంక్ ‘ఆర్బీఐ’ (RBI) కొరడా ఝుళిపించింది. కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), ప్రైవేట్ రంగ బ్యాంక్.. ఫెడరల్ బ్యాంక్ (Federal bank) సహా మరో రెండు ఫైనాన్స్ సంస్థలపై భారీ జరిమానా విధించింది. వడ్డీరేట్లతోపాటు బ్యాంకుల్లో కస్టమర్ సర్వీసు నిబంధనలు పాటించడంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) విఫలమైంది. కేవైసీ నిబంధనల అమలును ఫెడరల్ బ్యాంక్ ఉల్లంఘించింది. మెర్సిడెజ్-బెంజ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇండియా సైతం కేవైసీ, ఎన్బీఎఫ్సీ నిబంధనలను కొసమట్టం ఫైనాన్స్ లిమిటెడ్ ఉల్లంఘించాయి.
దీంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (RBI) పై రూ.72 లక్షలు, ఫెడరల్ బ్యాంక్ మీద రూ.30 లక్షలు, మెర్సిడెజ్ బెంజ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ మీద రూ.10 లక్షలు, కొసమట్టం ఫైనాన్సియల్ లిమిటెడ్ మీద రూ.13.38 లక్షల పెనాల్టీ విధించింది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)