కోర్టులో విచారణ సందర్భంగా న్యాయవాదులు పదే పదే న్యాయమూర్తులను ‘మై లార్డ్’, ‘యువర్ లార్డ్‌షిప్స్’ అని సంబోధించడంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవాది అలా అనడం ఆపితే (Stop Saying ‘My Lord’) తన జీతంలో సగం ఇస్తానని తెలిపారు. కాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏఎస్ బొపన్న, పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం ఒక పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది పలుమార్లు ‘మై లార్డ్’, ‘యువర్ లార్డ్‌షిప్స్’ అని న్యాయమూర్తులను సంబోధించారు.
దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి పీఎస్ నరసింహ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మై లార్డ్స్’ అని ఎన్నిసార్లు చెబుతావు. ఇలా చెప్పడం మానేస్తే నా జీతంలో సగం ఇస్తా’ అని ఆ సీనియర్ న్యాయవాదితో అన్నారు. ‘‘మై లార్డ్స్’ కు బదులుగా ‘సర్’ అని ఎందుకు అనకూడదు’ అని ప్రశ్నించారు. ‘మై లార్డ్స్’ అని ఆ సీనియర్ లాయర్ ఎన్నిసార్లు అంటారో తాను లెక్కపెడతానని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఏ న్యాయవాది కూడా న్యాయమూర్తులను ‘మై లార్డ్’, ‘యువర్ లార్డ్‌షిప్’ అని సంబోధించ కూడదన్న తీర్మానాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2006లో ఆమోదించింది. అయినప్పటికీ న్యాయవాదులు దానిని పాటించడం లేదు.
Here's Live Law Tweet
Stop calling me 'My Lord': Supreme Court judge to advocate
“How many times you will say 'My Lords'? If you stop saying this, then I will give you half of my salary,” Justice PS Narasimha, told a senior lawyer during a hearing on Wednesday.https://t.co/qmnkNL8kGn
— Law Today (@LawTodayLive) November 3, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)