గుజరాత్‌ వడోదరలోని సర్ సాయాజీరావు ఆస్పత్రి ఐసీయూలో ఓ కొవిడ్ బాధితురాలు చికిత్స పొందుతుండగా ఆమె ముఖంపై వందలాదిగా చీమలు దర్శనమిచ్చాయి. చీమలు విపరీతంగా కుట్టడంతో ఆమె ముఖమంతా వాచి పోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను బాధితురాలి భర్త సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయటంతో అది విపరీతంగా వైరల్ అయింది. కాగా రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆస్పత్రి సూపరెంటెండెంట్‌ రంజన్ అయ్యర్ తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)