గుజరాత్‌లో నదియాడ్‌ (Nadiad)లోని అహ్మదాబాద్‌ – వడోదర ఎక్స్‌ప్రెస్‌వే (Ahmedabad – Vadodara Expressway)పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ట్రైలర్‌ ట్రక్కును(car rams trailer truck) బలంగా ఢీ కొట్టింది . ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు వడోదర నుంచి అహ్మదాబాద్‌వైపు వెళ్తోంది. ఈ క్రమంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రైలర్‌ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో 10 మంది ఉన్నారు. వారిలో ఎనిమిది మంది స్పాట్‌లోనే చనిపోగా.. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)