Putin meets PM Modi: భారత్- రష్యా మధ్య కీలక ఒప్పందాలు, ఇక నుంచి భారత్‌లోనే తయారుకానున్న ఏకే-203 గన్స్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోడీ సమావేశం
భారత్- రష్యా(India-Russia) సంబంధాలు మరింత బలోపేతం దిశగా చర్చలు జరిపారు ఇరుదేశాల నేతలు. ఇప్పటి వరకు కొనసాగిన సంబంధాలు భవిష్యత్‌లో మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin). భారత పర్యటనకు వచ్చిన పుతిన్(Putin)తో ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) ద్వైపాక్షిక వార్షిక చర్చలు జరిపారు.
New Delhi December 07: భారత్- రష్యా(India-Russia) సంబంధాలు మరింత బలోపేతం దిశగా చర్చలు జరిపారు ఇరుదేశాల నేతలు. ఇప్పటి వరకు కొనసాగిన సంబంధాలు భవిష్యత్‌లో మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin). భారత పర్యటనకు వచ్చిన పుతిన్(Putin)తో ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) ద్వైపాక్షిక వార్షిక చర్చలు జరిపారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో ఇరువురు నేతల సమావేశం జరిగింది.
ఇరు దేశాల మధ్య విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, అది నానాటికీ మరింత బలోపేతం అవుతోందని అన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. కొవిడ్-19 సమయంలో కూడా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలంగానే ఉన్నాయని, అఫ్ఘాన్(Afghanistan) సహా ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు ఇరు దేశాలు పరస్పర అందుబాటులోనే ఉన్నాయని మోదీ అన్నారు.
Currently, mutual investments stand at about 38 billion with a bit more investment coming from the Russian side. We cooperate greatly in military & technical sphere like no other country. We develop high technologies together as well as produce in India: Russian President pic.twitter.com/04PerL7U8T
— ANI (@ANI) December 6, 2021
ఇండియా-రష్యాల మధ్య 21వ సమావేశం అనంతరం మోడీ మాట్లాడుతూ ‘‘మన రెండు దేశాలు చాలా సవాళ్లను ఎదుర్కొన్నాయి. ఒకరికొకరం సహకారం అందించుకోవడం మాత్రమే కాదు, ఇరువురి సెంటిమెంట్లను పరస్పరం గౌరవించుకుంటూ ఉంటాం. గడిచిన దశాబ్దంలో ప్రపంచంలో అనేక మార్పులను చూశాం. భౌగోళికంగా రాజకీయంగా ఆర్థికంగా అనేక అంశాల్లో చాలా మార్పులు వచ్చాయి. కానీ ఇండియా-రష్యా మధ్య స్నేహం ఆనాటి నుంచి పటిష్టంగానే ఉంది. ఈ రెండు దేశాల మద్య స్నేహం విశిష్టమైంది. నిజమైన స్నేహానికి ఇది వాస్తవిక రూపం’’ అని అన్నారు.
మేక్ ఇన్ ఇండియా కింద అభివృద్ధి, రక్షణ రంగంలో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నాయని మోదీ వెల్లడించారు. సైనిక-సాంకేతిక సహకారంపై ఇండియా-రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ ఫ్రేమ్‌వర్క్ కింద రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా కౌంటర్ సెర్గీ షోయ్‌గుతో చర్చలు జరిపారు. అంతరిక్షం, అణు రంగాలలో సహకారంతో ఇండియా, రష్యాలు మరింత దగ్గరవుతున్నాయని ప్రధాని మోదీ తెలిపారు.
ఇరుదేశాల మధ్య పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ముఖ్యంగా ఏకే-203(AK-203) రష్యా రైఫిల్స్ భారత్‌లోనే ఉత్పత్తిచేసి సైన్యానికి అందించడానికి రెండు దేశాల మధ్య ఇటీవలే ఒప్పందం కుదిరింది. సోమవారం ఇరు దేశాల రక్షణ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh), సెర్గీ షొయిగు ఒప్పందంపై సంతకాలు చేశారు. రష్యా టెక్నాలజీతో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఏర్పాటు చేసే మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌లో ఈ రైఫిల్స్ ఉత్పత్తి చేస్తారు. రూ.5,000 కోట్ల విలువ గల ఆరు లక్షల పై చిలుకు ఏకే-203 రైఫిల్స్ భారత్‌లోనే తయారవుతాయి. పదేండ్ల పాటు రక్షణ రంగంలో వ్యూహాత్మక సహకార ఒప్పందంపై ఇరు దేశాల రక్షణ మంత్రులు సంతకాలు చేశారు. అలాగే కలాష్నికోవ్ ఆయుధాల కోసం 2019లో జరిగిన ఒప్పందాల్లో సవరణలు తేవడానికి ఇరువురు నేతలు అంగీకరించారు.
రష్యాతో దీర్ఘకాలిక అనుబంధం కలిగి ఉండటంతోపాటు ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామి అని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. వివిధ అంశాలలో భారత్‌కు రష్యా అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు. ఇదిలా ఉంటే రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లవ్రోవ్, భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ద్వైపాక్షిక అంశాలపై చర్చించుకున్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)