New Delhi, Dec 6: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఇరు దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు (India-Russia Annual Summit 2021) కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు కీలక ఒప్పందాలపై వారు సంతాకలు చేయనున్నారు. కాగా అంతకు ముందు భారత్-రష్యాల మధ్య జరిగిన 2+2 సమావేశంలో నాలుగు కీలక ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. రైఫిల్స్ తయారీతో పాటు రానున్న 10ఏళ్లు రక్షణ సహకారంపై ఒప్పందం చేసుకున్నాయి.
ఈ భేటీలో భారత్, రష్యా రక్షణ, విదేశాంగ శాఖ మంత్రులు పాల్గొన్నారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతంపై చర్చలు జరిపారు. భారత్‌కు సహకారం అందించిన రష్యాకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. ఒక దేశంతో బంధాన్ని బలోపేతం చేసుకోవడం అంటే.. మరో దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి అన్నారు. తాజా పరిస్థితులతో ఆసియాలో శాంతి, స్థిరత్వం మెరుగుపడుతుందని రాజ్‌నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
PM Narendra Modi, Russian President Vladimir Putin meet in New Delhi
PM Modi says, "Despite the challenges posed by COVID, there is no change in the pace of growth of India-Russia relations. Our special & privileged strategic partnership continues to become stronger." pic.twitter.com/1FOHYtAzQY
— ANI (@ANI) December 6, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)