Raghuvansh Prasad Singh Dies: రఘువాన్ష్ ప్రసాద్ సింగ్ కన్నుమూత, ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కేంద్ర మాజీ మంత్రి మృతి, సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని
ఇటీవల కరోనాబారినపడ్డ ఆయన కోలుకున్నారు. అనంతరం అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వారం క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. కాగా, ఆర్జేడీ పార్టీలో కీలక నేతగా ఉన్న రఘువాన్ష్ (Raghuvansh Prasad Singh) గురువారమే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
New Delhi, September 13: కేంద్ర మాజీ మంత్రి రఘువాన్ష్ ప్రసాద్ సింగ్ (74) ఆదివారం ఉదయం (Raghuvansh Prasad Singh Dies) కన్నుమూశారు. ఇటీవల కరోనాబారినపడ్డ ఆయన కోలుకున్నారు. అనంతరం అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వారం క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. కాగా, ఆర్జేడీ పార్టీలో కీలక నేతగా ఉన్న రఘువాన్ష్ (Raghuvansh Prasad Singh) గురువారమే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి, లాలూప్రసాద్ యాదవ్ నమ్మినబంటు రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఆర్జేడీ ( RJD) పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ వ్యవహారాలతో తాను తీవ్ర అసంతృప్తికి గురయ్యానని, రాజీనామా చేసినందుకు క్షమించాలని లేఖలో పేర్కొన్నారు. కాగా, రఘువంశ్ సింగ్ రాజీనామాను ఆర్జేడీ అధినేత లాలూ ఆమోదించలేదు. ‘‘ఆస్పత్రి నుంచి మీరు (సింగ్) డిశ్చార్చి అయ్యాక మీతో నేను మాట్లాడతాను. ఈలోపు మీరు ఎక్కడికీ వెళ్లడం లేదు’’ అని సింగ్‌కు లాలూ లేఖ రాశారు. ఈ లోపే ఆయన తిరిగిరాని లోకాలు వెళ్లారు.
కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ మరణం పట్ల ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు. రఘువాన్ష్ ప్రసాద్ సింగ్ మనలో లేడు. ఆయన మరణం బీహార్‌తో పాటు దేశంలో కూడా రాజకీయ రంగంలో శూన్యతను మిగిల్చిందని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.