Rahul Gandhi Talk Show: రెండు రకాలుగా దెబ్బ తీసిన కరోనా, కోవిడ్ 19 తర్వాత ప్రపంచం సరికొత్తగా ఆవిష్కృతం అవుతుందని తెలిపిన రాహుల్ గాంధీ, ఇంకా ఎవరేమన్నారంటే..
కోవిడ్ 19 సంక్షోభం మీద కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం మాట్లాడుతూ.. ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా రెండు రకాలుగా తన పంజాను విసురుతుందని... మొదటిది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, ఇక రెండోది ప్రపంచ స్థితిగతులపై ప్రభావం చూపుతుందని ఆయన అంచనా వేశారు. కోవిడ్ 19 తర్వాత ప్రపంచం సరికొత్తగా ఆవిష్కృతం కానుందని ఆయన తేల్చి చెప్పారు.
New Delhi, May 27: ప్రపంచ రూపురేఖలను కోవిడ్-19 (COVID 19) పూర్తిగా మార్చివేసిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యానించారు. కోవిడ్ 19 సంక్షోభం మీద కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం మాట్లాడుతూ.. ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా రెండు రకాలుగా తన పంజాను విసురుతుందని... మొదటిది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, ఇక రెండోది ప్రపంచ స్థితిగతులపై ప్రభావం చూపుతుందని ఆయన అంచనా వేశారు. కోవిడ్ 19 తర్వాత ప్రపంచం సరికొత్తగా ఆవిష్కృతం కానుందని ఆయన తేల్చి చెప్పారు. ఇదొక అద్భుతం, కరోనా నుంచి 6 రోజుల్లోనే కోలుకున్న హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్, దేశంలో ఇదే తొలికేసు
కోవిడ్ -19 సంక్షోభంపై ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఆరోగ్య నిపుణులు డా. ఆశీష్ ఝాతో(Professor Ashish Jha) , స్వీడన్ కేంద్రంగా పనిచేస్తున్న ఎపిడమాలజిస్ట్ ప్రొ. జాన్ గెసికేతో (Professor Johan Geisecke) సంభాషించారు. వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్న ప్రదేశాలన్ని గ్లోబలైజేషన్‌కు ప్రధాన కేంద్రాలుగా భాసిల్లే ప్రాంతాలు. కరోనా తర్వాత ఓ కొత్త ప్రపంచాన్ని చూస్తాం. 9/11 దాడులను ప్రపంచం ఓ అధ్యాయంగా భావిస్తే.. ఇప్పుడు కోవిడ్-19ను ఓ పుస్తకంగా చూస్తుందని కాంగ్రెస్ ఎంపీ అన్నారు.
Here's what Professor Ashish Jha said:
కరోనావైరస్ కారణంగా పెద్ద పెద్ద పట్టణ కేంద్రాలు చాలా దెబ్బతిన్నాయని, ప్రజలు కలిసి ముందుకు వచ్చి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనాతో పోరాడడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాల్సిందేనని రాహుల్ చెప్పారు. కోవిడ్-19ను ఎదుర్కోవాలంటే కరోనా పరీక్షల సంఖ్యను పెంచడమే ఏకైక పరిష్కారమని ఆరోగ్య నిపుణులు డా. ఆశీశ్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం వ్యాక్సిన్ (Coronavirus Vaccine) వచ్చే అవకాశమే లేదని, వచ్చ సంవత్సరం వచ్చే ఛాన్స్ ఉందని ఆయన తేల్చి చెప్పారు.
Here's what Professor Johan Geisecke said:
భారతదేశంలోని అత్యధిక ఉష్ణోగ్రత కరోనాను నివారించగలదా అని ఆశిష్‌ను రాహుల్ ప్రశ్నించారు . దానికి తగిన ఆధారాలు లేవని ఆశిష్ స్పష్టం చేశారు ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేయడం వల్ల మాత్రమే వైరస్ వ్యాప్తిని తగ్గించగలమని పేర్కొన్నారు. అంతేకాక భారతీయులు తీసుకునే బీసీజీ వ్యాక్సిన్ వల్ల మన దగ్గర తక్కువ కేసులు నమోదవుతున్నాయనే విషయాన్ని కూడా తాను సమర్ధించడం లేదని ఆశిష్ అన్నారు. ఇందుకు తగిన ఆధారాలు కూడా లేవని స్పష్టం చేశారు. దేశంలో ఎందుకు కరోనా పరీక్షలు తక్కువగా నిర్వహిస్తున్నారని తాను సీనియర్ అధికారులను ఆరా తీయగా... ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తే ప్రజల్లో భయభ్రాంతులు చెలరేగే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారని రాహుల్ గాంధీ తెలిపారు.